E-Paper
Advertisement

Band Melam: బ్యాండ్ మేళానికి వేళాయెరా.. ఆ డేట్ పడతారని అస్సలు ఊహించలేదు!

Band Melam: బ్యాండ్ మేళానికి వేళాయెరా.. ఆ డేట్ పడతారని అస్సలు ఊహించలేదు!
Advertisement

Band Melam: సినిమా నిర్మించడంతో పాటు విడుదల చేయడంలోనూ స్ట్రాటజీ ఉంటేనే.. బాక్సాఫీస్ దగ్గర నిలబడగలరనే విషయం మేకర్స్‌కి తెలియంది కాదు. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించి, బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేసుకోవాలి. అదే సమయంలో, స్టార్ హీరోల సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే, వాటితో పాటు వస్తే మన సినిమాకు ఎంత వరకు యూజ్ అవుతుంది? అనేలా కొన్ని లెక్కలు వేసుకోవాలి. ఇప్పుడలాంటి లెక్కలు వేసుకునే ‘బ్యాండ్ మేళం’ (Band Melam) చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు. ‘కోర్ట్’ సినిమాతో ప్రేక్షకుల మన్ననలు పొందిన యంగ్ కపుల్ హర్ష్ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి అపళ్ల (Sridevi Apalla) జోడి మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్యాండ్ మేళం’. ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ మంచి స్ట్రాటజీతో ఫిక్స్ చేశారు. అదేంటంటే..

Also Read- Supritha: నేను చేసింది తప్పే.. ఇకపై ఆ తప్పులు జరగవు పశ్చాత్తాపడుతున్న సుప్రీత..

‘బ్యాండ్ మేళం’ రిలీజ్ డేట్ ఫిక్స్

Advertisement

ముందుగా ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడనే విషయానికి వస్తే.. మార్చి 13న రిలీజ్ (Band Melam Release Date) అని తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో హీరోహీరోయిన్లు స్మైలింగ్ ఫేస్‌లతో కనిపిస్తున్నారు. పోస్టర్ కలర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పటి వరకు అయితే మార్చి 13న ఈ ఒక్క చిత్రమే విడుదల కానుంది. అంటే సోలో రిలీజ్ అన్నమాట. మార్చి 6వ తేదీన రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. అవి రెండూ చిన్న సినిమాలే. మార్చి 13న ‘బ్యాండ్ మేళం’ థియేటర్లలోకి రానుంది. మార్చి 19న మాత్రం ‘డెకాయిట్’, ‘ధురంధర్ 2’, ‘టాక్సిక్’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ‘బ్యాండ్ మేళం’ చిత్రానికి మంచి టాక్ పడితే వారం రోజులు చాలు. సినిమాకు పెద్దగా బడ్జెట్ అవదు కాబట్టి.. చాలా వరకు సేఫ్ అవుతుంది. అందుకే మార్చి 13ను మేకర్స్ ఫిక్స్ చేశారు. నిజంగా ఇది ఊహించని ఎంట్రీ అనే చెప్పాలి. ఎందుకంటే, ఆ తేదీన ఏ సినిమా లేదని విషయం తెలుసుకుని, వెంటనే డేట్ అనౌన్స్ చేయడం నిజంగా స్ట్రాటజీ అనే అనుకోవాలి. చూద్దాం.. ఈ సినిమా సోలో రిలీజ్ అవుతుందా? లేదంటే, ఆ టైమ్‌కి ఇంకా ఏమైనా వచ్చి చేరతాయా? అనేది.

Also Read- Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్.. ఎలా ఉందంటే?

ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్

Advertisement

‘బ్యాండ్ మేళం’ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై బ్లాక్ బ‌స్ట‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ (Kona Venkat) నిర్మిస్తున్నారు. కావ్య‌, శ్రావ్య ఈ చిత్రానికి నిర్మాత‌లు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్’ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. శివ‌రాజు ప్ర‌ణ‌వ్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా స‌మ‌ర్ప‌ిస్తోంది. సంగీతం, ప్రేమ‌, భావోద్వేగాల క‌ల‌యిక‌గా స‌తీష్ జ‌వ్వాజి తెర‌కెక్కిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్ర‌బోస్ పాట‌ల‌ను రాస్తున్నారు. టాలెంటెడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ సాయికుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. భావోద్వేగాలతో నిండిన హృద్య‌మైన రూటెడ్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read- Actress Prema: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు విడాకులు తర్వాత ఎలా అయిపోయిందంటే..!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×