E-Paper
Advertisement

Supritha: సుప్రీతతో పెళ్లి .. రూ.20 వేలు ఖర్చు చేసిన అభిమాని..నటి రియాక్షన్ ఇదే!

Supritha: సుప్రీతతో పెళ్లి .. రూ.20 వేలు ఖర్చు చేసిన అభిమాని..నటి రియాక్షన్ ఇదే!
Advertisement

Supritha: సుప్రీత సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి (Surekha Vani)కుమార్తెగా అందరికీ ఎంతో సుపరిచితమైన సుప్రీత ఇండస్ట్రీలోకి రాకముందే సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటూ తనకు తన తల్లికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకొని సుప్రీత ఇప్పుడు వెండితెరపై నటిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న సుప్రీత త్వరలోనే అమరావతికి ఆహ్వానం (Amaravathiki Ahwanam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.

వెండితెర పైకి సుప్రీత..

ఈ నేపథ్యంలోనే సుప్రీత ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సుప్రీతకు అభిమానుల నుంచి విభిన్నమైనటువంటి కామెంట్లు వ్యక్తం అవుతూ ఉంటాయి కొంతమంది ఈమెపై విమర్శలు చేయగా మరి కొందరు మాత్రం ఈమెకు మద్దతుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాలలో కొంతమంది అభిమానులు లవ్ ప్రపోజల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీతకు కూడా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని ఈమె తెలియజేశారు.

ఫోన్ నెంబర్ కోసం రూ. 20000 వేలు..

Advertisement

అమరావతికి ఆహ్వానం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రీత మాట్లాడుతూ ఒక అభిమాని తన ఫోన్ నెంబర్ కనుక్కోవడం కోసం ఏకంగా 20 వేల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు .ఇలా నా ఫోన్ నెంబర్ కనుక్కొని తనని పెళ్లి చేసుకోవాలి అంటూ మెసేజ్ చేశారని తెలిపారు. ఆ మెసేజ్ చూసిన తర్వాత చాలా నవ్వుకున్నానని ఆ తర్వాత ఆ వ్యక్తి అకౌంట్ బ్లాక్ చేశానంటూ సుప్రీత తెలియజేశారు.

సుప్రీతకు పెళ్లి ప్రపోజల్..

Advertisement

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది సెలెబ్రిటీలకు లవ్ పెళ్లి ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి అయితే ఇలాంటి కామెంట్లను సెలెబ్రిటీలు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోరనే చెప్పాలి. ఇక సుప్రీత అమరావతికి ఆహ్వానం సినిమా విషయానికి వస్తే..జీవీకే డైరెక్షన్ లో తెరకేక్కిన ఈ సినిమాలో శివ కంఠం నేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రీత వంటి తదితరులు నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ చూస్తుంటే కనుక ఈ సినిమా హారర్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది. మరొక రెండు రోజులలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: Allu Arjun 42 Rules: అల్లు అర్జున్ 42 రూల్స్ .. పుష్ప నటుడు హాట్ కామెంట్స్..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×