E-Paper
Advertisement

Chiranjeevi: ‘పునాదిరాళ్లు’ కోసం కెమెరా ముందు నిలిచిన రోజు.. చిరు ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Chiranjeevi: ‘పునాదిరాళ్లు’ కోసం కెమెరా ముందు నిలిచిన రోజు.. చిరు ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే మహావృక్షం. ఎంత స్టార్‌డమ్ ఉన్నప్పటికీ, ఎంత మెగాస్టార్ అయినప్పటికీ.. తన పునాదిని మరిచిపోకుండా ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆయన సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి 48 వసంతాలు పూర్తయిన సందర్భంగా, తను ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చిన రోజు ఇదని (11-02-78) మెగాస్టార్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. నా ప్రయాణానికి పునాది రాళ్లు పడిన రోజు ఇదని, జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు.. ఇప్పటికీ నిన్న, మొన్న జరిగినట్లే అనిపిస్తుందని ఎమోషనల్ అయ్యారు. ఇదంతా ఒక చందమామ కథలాంటి అనుభూతిని ఇస్తుందని చెప్పుకొచ్చారు. చిరంజీవి చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు ‘జై చిరంజీవా’ అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన ట్వీట్‌లో ఏం చెప్పారంటే..

Also Read- Supritha: సుప్రీతతో పెళ్లి .. రూ.20 వేలు ఖర్చు చేసిన అభిమాని..నటి రియాక్షన్ ఇదే!

నా ప్రయాణానికి పునాది పడిన రోజు

Advertisement

‘‘ఈరోజు ‘పునాదిరాళ్లు’ (Punadhirallu) సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు’’ అని చిరంజీవి (Chiranjeevi) తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ పోస్ట్‌కు ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Allu Arjun: పుష్ప తరువాత నిజంగానే అల్లు అర్జున్ వ్యవహార తీరు మారిందా.. గతంలో కూడా ఇంతే.. ఇదే క్లారిటీ..!

ఎప్పటికీ మా మెగాస్టార్ మీరు..

Advertisement

‘ఆ తొలి అడుగు, ఈ రోజు ఒక మహాయాత్రగా మారింది అన్నయ్య. ‘పునాదిరాళ్లు’తో మొదలైన మీ ప్రయాణం కోట్ల మందికి ప్రేరణ.. ఎప్పటికీ మా మెగాస్టార్ మీరు’, ‘ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ.. నీ నుంచి ఎప్పుడూ అదే కష్టం, కమిట్మెంట్..! అందుకే, నీ మీద అభిమానం మొదలైనప్పటినుంచి నువ్వంటే మాకు ఎప్పుడూ అదే ఇష్టం..!’, ‘నీ కష్టమే నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది’ అంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్లలో అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే, ఈ సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రంలో రీజనల్ ఫిల్మ్స్ కేటగిరీలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఉత్సాహంలో ఆయన తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయనున్నారు.

Also Read- Action King Arjun: ‘జెంటిల్‌మెన్’కు మొదట అనుకున్న హీరో నేను కాదు.. ఎవరంటే?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×