E-Paper
Advertisement

Suresh Babu -Akhanda 2: అఖండ 2 ఫైనాన్స్ ఇష్యూ.. స్పందించిన సురేష్ బాబు.. అనవసరమంటూ !

Suresh Babu -Akhanda 2: అఖండ 2 ఫైనాన్స్ ఇష్యూ.. స్పందించిన సురేష్ బాబు.. అనవసరమంటూ !
Advertisement

Suresh Babu -Akhanda 2: బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఫైనాన్స్ ఇబ్బందుల కారణంగా చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఇలా ఈ సినిమా వాయిదా పడిన నేపథ్యంలో అభిమానులు తీవ్రస్థాయిలో నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలన్నీ సినిమా విడుదలకు ముందే చూసుకోవాలి కానీ, సినిమా విడుదలకు గంటల సమయం ఉన్న నేపథ్యంలో ఈ ఇబ్బందులు కారణంగా వాయిదా వేయటం సరి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు సైతం ఈ విషయంపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఆఖండ 2 ఫైనాన్స్ ఇష్యూ.. రంగంలోకి సురేష్ బాబు

సురేష్ బాబు తాజాగా శ్రీ నందు హీరోగా నటించిన సైక్ సిద్ధార్థ్ సినిమా వేడుకలో పాల్గొన్నారు. ఈ సినిమా హీరో రానా దగ్గుబాటి,నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి పాటను విడుదల చేశారు .అలాగే చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ బాబు(Suresh Babu)కు అఖండ 2 సినిమా ఫైనాన్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

సినిమా బిజినెస్ గురించి చర్చల అవసరమా?

Advertisement

ప్రస్తుతం అఖండ 2 సినిమా ఎదుర్కొంటున్న సమస్య మీరు తలుచుకుంటే సాల్వ్ అవుతుందని తెలుస్తుంది. ఈ సమస్యపై మీ స్పందన ఏంటి అంటూ ప్రశ్న ఎదురైంది. నేను ఈ కార్యక్రమానికి ఆలస్యంగా రావడానికి కారణం కూడా అదే కారణం అని తెలిపారు. చర్చలు కూడా దాదాపు పూర్తి కావచ్చాయని తెలిపారు. ప్రతి సినిమాకు ఇలాంటి సమస్యలు అనేవి సర్వసాధారణంగా వస్తాయని తెలిపారు. అనుకోకుండా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ పార్ట్ మొత్తం బయటపడిపోయిందని సురేష్ బాబు తెలిపారు. ఈ సినిమాకి ఈ సమస్య ఉందా? ఇంత డబ్బులు ఖర్చు చేశారా? ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ అనవసరమైన చర్చలని సురేష్ బాబు తెలిపారు.

అఖండ 2 సమస్యకు పరిష్కారం..

Advertisement

ఈ సినిమా విషయంలో ఈ చర్చలన్నీ అనవసరం అంటూ సురేష్ బాబు కొట్టి పారేశారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సినిమా కూడా విడుదల అవుతుంది అంటూ ఈయన ఆశ భావం వ్యక్తం చేశారు. ఇలా అఖండ 2 సినిమా ఫైనాన్స్ ఇష్యూ గురించే సురేష్ బాబు మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు బాలయ్య అభిమానులకు కాస్త సంతోషాన్ని కలిగించాయి త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని, సినిమా విడుదల కాబోతుందని చెప్పడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 సినిమా విడుదల కావాల్సి ఉండగా నాలువ తేదీ రాత్రి ఈ సినిమా వాయిదా పడిందంటూ నిర్మాతలు అధికారకంగా ప్రకటించడంతో అభిమానులు చిత్ర నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Varanasi Glimpse : అవతార్: ఫైర్ అండ్ యాష్ తో వారణాసి గ్లింప్స్ రిలీజ్ ..

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×