E-Paper
Advertisement

Delhi Politics: ఈనెల చివర్లో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక.. రేసులో కిషన్ రెడ్డి-పురందేశ్వరి పేర్లు

Delhi Politics: ఈనెల చివర్లో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక.. రేసులో కిషన్ రెడ్డి-పురందేశ్వరి పేర్లు
Advertisement

Delhi Politics: బీజేపీ అధ్యక్ష పీఠం ఈసారి దక్షిణాది వారికి దక్కుతుందా? తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ ఎక్కువగా ఉందా? తమిళనాడుకి చెందిన నేతలు డ్రాపయ్యారా? ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడమే అందుకు కారణమా? ఇంతకీ తెలుగు రాష్ట్రాల నుంచి రేసులో ఉన్నదెవరు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ఈనెల చివర్లో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక?

Advertisement

యూపీ అధ్యక్షుడి ఎంపిక ఈనెల లేదా వచ్చే నెలలో పూర్తి కానుంది. తర్వాత బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్నది తేలిపోనుంది. మళ్లీ ఏప్రిల్ లేదా మే వరకు రాష్ట్రాల ఎన్నికలు లేకపోవడంతో అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ పెద్దలు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నా తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి భిన్నంగా ఉండడంతో ఇక్కడి నుంచి ఓ వ్యక్తిని ఎంపిక చేయాలని భావిస్తోందట పార్టీ హైకమాండ్. అందులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నట్లు ఢిల్లీ పొలిటికల్ వర్గాల సమాచారం.

Advertisement

అధ్యక్షుడి రేసులో కిషన్‌రెడ్డి-పురందేశ్వరి

అందుకు కారణాలు లేకపోలేదు. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి వేరుగా ఉంది. ఇలాంటి సమయంలో కిషన్‌రెడ్డి అధ్యక్ష పీఠంపై కూర్చొబెడితే మంచి ఫలితాలు వస్తాయన్నది ఆ పార్టీ ఆలోచన గా కొందరు నేతలు చెబుతున్నారు. ఎందుకంటే పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్నారు. అందులోనూ యువకులను ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు.

ఈ క్రమంలో ఆయన పేరును కొందరు సూచించినట్టు చెబుతున్నారు. ఈ పదవి రేసులో మాజీ కేంద్రమంత్రి, ఎంపీ పురందేశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో ఇప్పటివరకు మహిళలు అధ్యక్ష పీఠంపై కూర్చున్న సందర్భాలు లేవు. రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చింది బీజేపీ. పార్టీ అధ్యక్షురాలిగా ఆమెకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని మరికొందరు భావిస్తున్నారట.

ALSO READ:  శబరిమలలో రచ్చ.. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి

దీనివల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీకి మాంచి ఊపు వస్తుందని అంటున్నారు. ఈ రెండు పేర్లలో ఎవరో ఒకరు ఓకే కావడం ఖాయమని అంటున్నారు. ఒకవేళ కిషన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఎంపికైతే, కేంద్రమంత్రిగా పురందేశ్వరికి అవకాశం రావచ్చని అంటున్నారు. ఈ సస్పెన్ష్‌కు తెరపడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Related News

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×