E-Paper
Advertisement

Suriya: మరో టాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య.. ?

Suriya: మరో టాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య.. ?
Advertisement

Suriya: ప్రస్తుతం ఇతర భాష హీరోలు అందరూ తెలుగు పైనే ఫోకస్ చేస్తున్నారు. ఈమధ్య తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచస్థాయిగా ఎదుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరు టాలీవుడ్ లో సినిమాలు చేయడం, తెలుగు డైరెక్టర్ తో సినిమాలు చేయడం చేస్తూ తమ స్థాయిని పెంచుకుంటున్నారు. గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఒక మంచి హిట్ లేదు అన్న విషయం తెలిసిందే.

ఒకప్పుడు వరుస విజయాలతో కొనసాగిన సూర్య మూడేళ్ళుగా పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఇక గతేడాది కంగువ అంటూ వచ్చి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాది రెట్రో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.  ఇక దీంతో సూర్య ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే లక్కీ భాస్కర్ తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఒక సినిమా మొదలుపెట్టాడు.

Advertisement

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుని షూటింగ్ జరుపుకుంటుంది. ఇది కాకుండా తమిళ్ లో సూర్య.. వెట్రిమారన్ తో ఒక సినిమా మొదలుపెట్టాడు. అదే వాడీవసూల్. ఈ సినిమా కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఇక ఇప్పుడు సూర్య తమిళ్ లో ఒక కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కాకుండా మరో తెలుగు సినిమాకు ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుగులో మంచి ఫీల్ గుడ్ మూవీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సూర్య టై అప్ అయ్యాడని తెలుస్తుంది. బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి లాంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వివేక ఆత్రేయ ఒక మంచి కథను సూర్యకు వినిపించాడని, ఆ కథ సూర్యకు  బాగా నచ్చడంతో వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లమని కోరినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను మైత్రీ  మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ఈ ప్రాజెక్టును సెట్స్ మీదకి తీసుకెళ్లారున్నారని తెలుస్తుంది. మరి సూర్య తెలుగు సినిమాలతో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×