E-Paper
Advertisement

BIG Shock to KTR: కేటీఆర్ కు బిగ్ షాక్.. విచారణకు గవర్నర్ అనుమతి, షాకైన బీఆర్ఎస్ నేతలు

BIG Shock to KTR: కేటీఆర్ కు బిగ్ షాక్..  విచారణకు గవర్నర్ అనుమతి, షాకైన బీఆర్ఎస్ నేతలు
Advertisement

BIG Shock to KTR: బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలకు కష్టాలు తప్పలేదు. వరుసగా కేసులు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. తాజాగా ఫార్ములా ఈ-కారు రేసు కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఊహించిన షాక్ తగిలింది. కేటీఆర్‌ని విచారించేందుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

కొత్త మలుపు తిరిగిన ఫార్ములా ఈ-కారు రేసు కేసు 

Advertisement

ఫార్ములా ఈ-కారు రేసు కేసు కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఆయన్ని విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దాదాపు 70 రోజుల తర్వాత విచారణకు ఓకే చెప్పారు గవర్నర్. త్వరలో కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేయనుంది ఏసీబీ.

రేపో మాపో ఆయన్ని ఏసీబీ ప్రాసిక్యూషన్ చేయనుంది. విచారణ తర్వాత ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశముంది. అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై డీఓపీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్రం అనుమతి ఇస్తే ఆయనపై కూడా అభియోగాలు నమోదు చేసి విచారించనుంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా నాలుగు సార్లు ఏసీబీ ముందు హాజరయ్యారు కేటీఆర్. ఈ కేసులో ఏ-1 గా కేటీఆర్, ఏ-2 ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు.

Advertisement

కేటీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు గవర్నర్ అనుమతి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో గతేడాది డిసెంబర్ 19న కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది ఏసీబీ. రూ. 54 కోట్ల లావాదేవీల విషయంలో ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఇప్పుడు ఏసీబీ ఏం చేయనుంది? ఇప్పటివరకు జరిగిన విచారణ వేరు, ఇకపై మరింత లోతుగా విచారించనుంది ఏసీబీ. ఆయనపై అభియోగాలు నమోదు చేయాలంటే కచ్చితంగా గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవాలి.

కేటీఆర్ మూలంగా అవినీతి జరిగిందని ఏసీబీ నిరూపించాల్సి ఉంటుంది.  బలమైన సాక్ష్యాలు న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలి. కేటీఆర్‌ను అరెస్టు చేయాలన్నా పద్దతి ప్రకారం వెళ్లాల్సి వుంటుంది.  మళ్లీ నోటీసులు ఇచ్చి విచారణకు ఏసీబీ పిలిచే అవకాశముంది. ఆ సమయంలో అరెస్టు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ALSO READ:  రూటు మార్చిన కాంగ్రెస్ పార్టీ..  సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన

కేటీఆర్ విషయంలో ఎలా వెళ్లాలన్న దానిపై అధికారులు న్యాయనిపుణులతో మంతనాలు సాగిస్తున్నారు. లొట్ట పీసు కేసు అంటూ పదే పదే చెబుతున్నారు కేటీఆర్. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి కూడా.  మరోవైపు విచారణకు గవర్నర్ అనుమతి విషయం తెలియగానే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు షాకయ్యారు. తమ నేత అరెస్టు కావడం ఖాయమనే ప్రచారం అప్పుడే మొదలైంది. అప్పుడే న్యాయనిపుణులతో కేటీఆర్ సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.  కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు ఆ పార్టీ సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.

 

 

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×