Wedding Song:’విశ్వనాథ్ అండ్ సన్స్’…కోలీవుడ్ స్టార్ సూర్య.బ్యూటిఫుల్ హీరోయిన్ మమితా బైజు కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్.ఇక సార్,లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో వంటి సినిమాలతో సత్తా చాటిన వెంకీ అట్లూరీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటం తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి . ఇక ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.
ఆగస్టు 14న ఇండిపెండెన్స్ సందర్భంగా
ఇక ఇప్పటికే ఈ సినిమాని ఆగస్టు 14న ఇండిపెండెన్స్ సందర్భంగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు కూడా.ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర యూనిట్.అందులో భాగంగా మేకర్స్ తాజాగా విడుదల చేసిన ‘ది వెడ్డింగ్ సాంగ్’ లిరికల్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ పాటలో కనిపించే కలర్‌ఫుల్ విజువల్స్, వింటేజ్ గ్లామర్ లుక్‌లో సూర్య స్టైలిష్‌గా ఇచ్చిన ఎనర్జిటిక్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది కూడా.మరో వైపు జి.వి. ప్రకాష్ కుమార్ ఇచ్చిన మాస్-కమ్-మెలోడీ పునకాలు తెప్పిస్తున్నాయి.గతంలో సూర్య-జి.వి. ప్రకాష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ ఆల్బమ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందని భారీ ఆశలే పెట్టుకున్నారు సూర్య ఫ్యాన్స్.ఇక ఇందులో స్వయంగా సూర్య పాడిన వోకల్స్ సినిమాకి మెయిన్ ఎసెట్ . ఇక రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ కూడా చాలా క్యాచీగా ఉండటంతో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి వెడ్డింగ్ ఫంక్షన్‌లో వినిపించడం ఖాయం
మలయాళంలో ‘ప్రేమలు’ సినిమాతో యూత్‌కు బాగా దగ్గరైన మమితా బైజు, ఈ పాటలో సూర్యతో కలిసి వేసిన డాన్స్ మూమెంట్స్ చూస్తుంటే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందో అర్థమవుతుంది.ఇక పాత విన్నవాళ్ళంతా రాబోయే పెళ్లిళ్ల సీజన్‌లో ఈ సాంగ్ ప్రతి వెడ్డింగ్ ఫంక్షన్‌లో వినిపించడం ఖాయమంటూ ఊదరగొట్టేస్తున్నారు.
ఇక సినిమా కథ విషయానికి వస్తే… 40 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్ల అమ్మమాయికి ధ్య పుట్టే వెరైటీ ప్రేమకథను దర్శకుడు వెంకీ అట్లూరి ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారని సమాచారం. ఇప్పటికే ధనుష్‌తో ‘సార్’, దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయాలు అందుకున్న వెంకీ అట్లూరి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
హ్యాట్రిక్ సక్సెస్ అందిస్తుందా లేదా
హిందీ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. కరుప్పు తర్వాత సూర్య నుంచి వస్తున్న పూర్తి స్థాయి ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ ఇదే కావడంతో అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ వెడ్డింగ్ సాంగ్ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంటోంది.చూడాలి మరి ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా వెంకీ అట్లూరికి హ్యాట్రిక్ సక్సెస్ అందిస్తుందా లేదా చూడాలి.