E-Paper
Advertisement

ఇంట్లో వాడే.. నూనె మీ గుండెను దెబ్బతీస్తోందా?

ఇంట్లో వాడే.. నూనె మీ గుండెను దెబ్బతీస్తోందా?
Advertisement

Cooking Oil Truths:  ఆరోగ్యంగా ఉండాలని, గుండె సమస్యలు రాకూడదని చాలా మంది విపరీతమైన ధరలు పెట్టి ‘ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్’ లేదా ‘హెల్దీ రిఫైన్డ్ ఆయిల్స్’ కొంటారు. అయితే మార్కెట్‌లో లభించే ఆలివ్ ఆయిళ్లలో దాదాపు 70 శాతానికి పైగా నకిలీవి లేదా కల్తీ చేసినవేనని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్న సంచలన నిజం మీకు తెలుసా? మనం రోజువారీ వంటల్లో వాడే నూనె నిజంగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందా లేక నెమ్మదిగా రోగాల బారిన పడేస్తుందా? కుకింగ్ ఆయిల్స్ వెనక ఉన్న నగ్న సత్యాలు, నిజమైన నూనెను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేక్ రిఫైన్డ్ ఆయిల్ నెట్‌వర్క్:

రిఫైన్డ్ ఆయిల్ అనగానే చాలా మంది కళ్ళు మూసుకుని కొనేస్తుంటారు. అయితే నాణ్యత లేని  ఆయిల్‌లో సోయాబీన్, పామాయిల్, లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్‌లను కలిపి, ఆకుపచ్చ రంగు, ఇతర పదార్థాలు కలిపి  ‘ప్యూర్  ఆయిల్’ పేరుతో అమ్ముతున్నారు.

Advertisement

ఇంట్లోనే ప్యూర్  ఆయిల్‌ను గుర్తించే చిన్న ట్రిక్:

మీరు కొన్న ఆయిల్ బాటిల్‌ను ఒక రోజంతా ఫ్రిజ్‌లో (ఫ్రీజర్‌లో కాదు) ఉంచండి. అది నిజమైన  ఆయిల్ అయితే గడ్డకట్టుకుపోతుంది లేదా చిక్కగా మారుతుంది. ఒకవేళ అది ద్రవ రూపంలోనే ఉంటే అందులో కల్తీ నూనెలు కలిసి ఉన్నాయని అర్థం.

Advertisement

రిఫైన్డ్ ఆయిల్స్:

ఇక మన ఇళ్లలో వాడే సాధారణ రిఫైన్డ్ ఆయిల్స్ (సన్‌ఫ్లవర్, సోయాబీన్, కాటన్ సీడ్) తయారీలో కెమికల్స్, బ్లీచింగ్ ఏజెంట్లు, విపరీతమైన వేడిని ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ లో నూనె లో ఉండే పోషకాలన్నీ నశించిపోతాయి. వీటిని నిత్యం వాడటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగి గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి.

Also Read: జీరో కేలరీస్ అని తాగుతున్నారా? ‘షుగర్ ఫ్రీ డ్రింక్స్’ చేసే అసలు నష్టం ఇదే!

బెస్ట్ ఆల్టర్నేటివ్:

మన పూర్వీకులు వాడిన గానుగ నూనెలు (కట్టె గానుగ ఆడించిన నూనెలు) ఆరోగ్యానికి బెస్ట్. ఎలాంటి రసాయనాలు, విపరీతమైన వేడి ఉపయోగించకుండా విత్తనాల నుంచి నూనె తీయడం వల్ల అందులోని సహజ సిద్ధమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు అలాగే ఉంటాయి. వేరుశనగ గానుగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనెలు మన వంటకాలకు పర్‌ఫెక్ట్‌గా సరిపోతాయి. అందుకే వీటిని వాడటం చాలా మంచిది.

‘రిఫైన్డ్’ లేదా ఫేక్ ‘ఆలివ్ ఆయిల్’ అనే అట్రాక్టివ్ లేబుల్స్ చూసి మోస పోకండి. ప్రాసెస్ చేసిన నూనెలకు దూరంగా ఉండి, స్థానికంగా లభించే శుద్ధ మైన గానుగ నూనెలను వాడటం అలవాటు చేసుకోండి. సరైన నూనెను ఎంచుకోవడం ద్వారా మీ కుటుంబాన్ని గుండె జబ్బులు, బీపీ, అధిక బరువు నుంచి చాలా వరకు కాపాడు కోవచ్చు. అంతే కాకుండా క్యాన్సర్ వంటివి రాకుండా ఉండేలా జాగ్రత్త పడవచ్చు. అందుకే ధర ఎక్కువయినా కూడా గానుగ నూనెలు వంటకాల తయారీ లో వాడటం అలవాటు చేసు కోవడం ఆరోగ్యానికి మంచి దని నిపుణులు చెబు తున్నారు.

Related News

పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతోంది.. టీనేజ్ విద్యార్థుల్లో ప్రమాదకర మార్పులు.. కారణాలు ఇవే

వయసు పెరిగినా అద్భుతమైన జ్ఞాపకశక్తి.. పదునైన మెదడు కోసం పది సూత్రాలు

SIR తర్వాత ఓటర్ లిస్ట్‌లో మీ పేరు కనిపించడం లేదా? మళ్లీ నమోదు చేసుకోవడానికి ఇలా చేయండి

వెన్నునొప్పి, మెడ నొప్పితో బాధపడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే ఫిజియోథెరపీ అవసరం

దేవుడిపై బలమైన నమ్మకం.. ఈ తేదీల్లో పుట్టినవారిలో ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ

బ్రేకప్ తర్వాత మళ్లీ డేటింగ్ ఎప్పుడు ప్రారంభించాలి? మళ్లీ ప్రేమలో పడే ముందు ఈ విషయాలు ఆలోచించండి

ఈ విధానంలో భోజనం చేస్తే షుగర్ ఎప్పుడూ పెరగదు.. మధుమేహులకు డాక్టర్ చెప్పిన సింపుల్ చిట్కా

పేరు లేని బంధం.. బ్రేకప్ కూడా కాదు.. అయినా సిచ్యుయేషన్‌షిప్ ఎందుకింత బాధిస్తుంది?

Big Stories

Advertisement
×