E-Paper
Advertisement

Puri jagannadh: సూర్య పూరి జగన్నాథ్ కాంబోలో మిస్సైన సూపర్ హిట్ మూవీ.. మళ్ళీ ఇన్నాళ్ళకు?

Puri jagannadh: సూర్య పూరి జగన్నాథ్ కాంబోలో మిస్సైన సూపర్ హిట్ మూవీ.. మళ్ళీ ఇన్నాళ్ళకు?
Advertisement

Puri jagannadh: టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలందరూ కూడా సినిమాలు చేసి సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పూరి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు హీరోలు ఎవరు కూడా ఈయనతో సినిమా చేయటానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ హీరోలతో పూరి జగన్నాథ్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు.

సూర్య పూరి కాంబో మూవీ..

పూరి జగన్నాథ్ ప్రస్తుతం నటుడు విజయ్ సేతుపతితో కలిసి స్లమ్ డాగ్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదల కాకుండానే పూరి జగన్నాథ్ మరొక కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సినిమా చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ పడినట్లేనని అభిమానులు కూడా భావిస్తున్నారు.

బిజినెస్ మేన్ సూర్య రిజెక్ట్ చేశారా?

Advertisement

తాజాగా సూర్య(Suriya) పూరి జగన్నాథ్ సినిమాలకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది నిజానికి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూర్య ఇదివరకే ఓ సినిమా చేయాల్సి ఉండేదట కానీ ఆ సినిమా మిస్ అయిందని తెలుస్తోంది. మరి పూరి డైరెక్షన్ లో సూర్య చేయాల్సిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే.. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో బిజినెస్ మేన్(Businessman) ఒకటి. ఈ సినిమాలో మహేష్ బాబు సూర్య పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచి మంచి సక్సెస్ అందుకున్నారు. నిజానికి ఈ బిజినెస్ మాన్ స్టోరీ పూరి జగన్నాథ్ ముందుగా నటుడు సూర్యకు వినిపించారట. అయితే కొన్ని కారణాలవల్ల సూర్య ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో తదుపరి మహేష్ బాబుతో పూరి జగన్నాథ్ ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారని తెలుస్తోంది.

మైత్రి నిర్మాణంలో సూర్య పూరి సినిమా?

Advertisement

ఇక ఈ సినిమా సూర్య రిజెక్ట్ చేసినప్పటికీ మహేష్ బాబు పాత్రకు మాత్రం సూర్య అని పేరు పెట్టడం విశేషం. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో అప్పుడు మిస్ అయినా, ఇన్నాళ్లకు తిరిగి మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పూరి జగన్నాథ్ సూర్యకు కథ కూడా నేరేట్ చేశారని, కథ నచ్చడంతో సూర్య సైతం ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కబోతోందని ,పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుందంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు.

Also Read: Hero Vijay Divorce: పెళ్లయిన 26 ఏళ్లకు విడాకులు కోరిన విజయ్ వైఫ్ సంగీత.. రూమర్లే నిజమా?

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×