E-Paper
Advertisement

Elinati Shani: ఆ మూడు రాశులకు ఎలినాటి శని – తీవ్రమైన కష్టాలకు ఆ రెమెడీ ఒక్కటే పరిష్కారమట

Elinati Shani: ఆ మూడు రాశులకు ఎలినాటి శని – తీవ్రమైన కష్టాలకు ఆ రెమెడీ ఒక్కటే పరిష్కారమట
Advertisement

Elinati Shani: ఆ మూడు రాశులకు ప్రస్తుతం ఎలినాటి శని నడుస్తుంది. దీంతో ఆ రాశుల జాతకులు పడరాని కష్టాలు పడుతున్నారు. అయితే వారి కష్టాలు తీరిపోవాలన్నా.. వారు ప్రశాంతమైన జీవితం గడపాలన్నా శనిదేవుడికి ఇష్టమైన కొన్ని రెమెడీలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ రెమెడీలు ఏంటి..? ఎలా చేయాలి..? అనే విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఏలినాటి శని సాడేసాత్‌.. అష్టమ శని దోషం, అర్ధాష్టమ శని నడుస్తున్నవారు.. చాలా కష్టాలు పడుతుంటారు. వీరికి కొన్ని సందర్భాలలో జీవితం మీద విరక్తి వస్తుంటుంది. ఏ పని చేసినా కలిసిరాకపోవడం. పైగా నష్టపోతుండటం. అయితే మరీ ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్న కుంభ, మీన, మేష రాశుల వారి పరిస్థితి మరీ దీనావస్థగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అయితే ఈ మూడు రాశులకు చెందిన జాతకులు శనికి సంబంధించిన రెమెడీస్‌ పాటిస్తే శని వీరిని బాధించడని చెప్తున్నారు.

శని దేవుడిని పూజించడం వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు:

Advertisement

జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని లేదా అర్థాష్టమ శని నడుస్తున్నప్పుడు ఎదురయ్యే మానసిక, శారీరక మరియు ఆర్థిక ఇబ్బందుల తీవ్రత తగ్గుతుంది. శని దేవుడి అనుగ్రహం ఉంటే ఆపదలు తొలగిపోతాయి. శని దేవుడు క్రమశిక్షణకు మారుపేరు. ఆయనను పూజించడం వల్ల మనిషిలో సోమరితనం పోయి, పనుల పట్ల శ్రద్ధ, బాధ్యత పెరుగుతాయి. ఇది జీవితంలో విజయం సాధించడానికి దోహదపడుతుంది. వ్యాపారంలో నష్టాలు ఉన్నా లేదా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నా, శని దేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోయి, సంపద కలుగుతుందని నమ్ముతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని దేవుడు “ఆయుః కారకుడు”. ఆయనను ఆరాధించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి మరియు అకాల మృత్యు భయం తొలగి పూర్ణాయుష్షు లభిస్తుంది. తెలిసో తెలియకో చేసిన తప్పుల వల్ల కలిగే దుష్ప్రభావాలను శని దేవుడు తగ్గిస్తాడు. మనసులో పశ్చాత్తాపంతో ఆయనను శరణు కోరితే, కర్మ ఫలాల తీవ్రతను తగ్గించి మనశ్శాంతిని ప్రసాదిస్తాడు.

శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని మార్గాలు:

శనివారం రోజున నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, పేదలకు, వికలాంగులకు నల్లని వస్త్రాలు, నువ్వులు లేదా అన్నదానం చేయడం, హనుమంతుడిని పూజించే వారిని శని దేవుడు ఇబ్బంది పెట్టడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల  హనుమాన్‌ పారాయణ చేయడం ఉత్తతమైనదిగా చెప్తుంటారు. అలాగే శని దేవుడికి సంబంధించిన “ఓం శం శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని  ప్రతిరోజూ జపించడం. వల్ల కూడా శని శాంతించి ఆ మూడు రాశుల జాతకులకు మంచి చేస్తాడని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అలాగే శని దేవుడు కేవలం శిక్షించేవాడు మాత్రమే కాదు, ధర్మ మార్గంలో నడిచేవారిని అత్యున్నత శిఖరాలకు చేర్చే దేవుడని కూడా గుర్తు చేస్తున్నారు.

Advertisement

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఈ నక్షత్రంలో తిరుమల శ్రీవారిని దర్శిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×