E-Paper
Advertisement

Swapna Dutt: ఛాంపియన్‌ వేరే వాళ్ళు తీసుంటే అద్భుతం అనేవాళ్లు.. నిర్మాత స్వప్న దత్ సంచలన కామెంట్స్

Swapna Dutt: ఛాంపియన్‌ వేరే వాళ్ళు తీసుంటే అద్భుతం అనేవాళ్లు.. నిర్మాత స్వప్న దత్ సంచలన కామెంట్స్
Advertisement

Swapna Dutt Comments: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలలో వైజయంతి మూవీ బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఒక తరుణంలో ఈ బ్యానర్ కంప్లీట్ గా సినిమాలు చేయటం ఆపేస్తుంది అనుకున్న టైం కూడా నడిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా ఈ బ్యానర్ కు విపరీతమైన లాస్ తీసుకొచ్చింది. అక్కడితో సినిమా నిర్మాణం ఆపేద్దామని కూడా ఆల్మోస్ట్ అశ్విని దత్ ఫిక్స్ అయిపోయారు.

Advertisement

అదే తరుణంలో స్వప్న, ప్రియాంక ఎవడే సుబ్రహ్మణ్యం అని సినిమాను చేయాలని నిశ్చయించుకున్నారు. ఆ టైటిల్ విని అశ్విని దత్ మొదట పెద్దగా ఆసక్తి చూపలేదు. టైం బాలేదు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని అన్నారు. సరే ఇన్ని కోట్లు పోయాయి కదా ఇవి కూడా పోనీయండి అనే ఉద్దేశంతోనే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా స్వప్న సినిమా పేరు మీద చేశారు. నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమైన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమా తర్వాత స్వప్న సినిమాస్ కు గోల్డెన్ డేస్ మొదలయ్యాయి.

వేరే వాళ్ళు తీస్తే అద్భుతం అంటారు

ప్రస్తుతం వైజయంతి బ్యానర్ కు ఏ రేంజ్ నేమ్ ఉంది అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంది ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలను లాంచ్ చేసింది ఇదే బ్యానర్. ఇకపోతే ఈ బ్యానర్లు శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక నటించిన ఛాంపియన్ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి మంచి టాక్ వస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో నిర్మాత స్వప్నా దత్ సంచలన కామెంట్ చేశారు. ఈ సినిమాకి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. అలానే కొంతమంది క్రిటికల్ రివ్యూస్ కూడా ఇచ్చారు. ఇదే సినిమాను మేము కాకుండా వేరే వాళ్ళు తీసుకుంటే అద్భుతం అని పొగిడే వాళ్ళు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు స్వప్న దత్.

Advertisement

Also Read: Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి షాకింగ్ డెసిషన్.. సినిమాలు గ్యాప్‌కి అదే కారణమా?

పెద్ద బ్యానర్ అవ్వడం వల్లనే?

మామూలుగా రీసెంట్ టైమ్స్ లో చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ సాధిస్తున్నాయి. కమర్షియల్ గా కూడా కాసులు వర్షం కురుస్తుంది. అయితే వైజయంతి బ్యానర్ స్థాయి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి వంటి సక్సెస్ ఆ బ్యానర్ కు ఉంది. అటువంటి బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అంచనాలు ఉండటం అనేది సహజంగానే జరుగుతుంది. అలానే ఈ సినిమాకి సంబంధించి విపరీతంగా కూడా డబ్బులు ఖర్చుపెట్టినట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి. రోషన్ మేక మార్కెట్ ను మించి ఈ సినిమాకు ఖర్చు పెట్టారు. అయితే ఈ బ్యానర్ నుంచి వస్తుంది కాబట్టి భారీ అంచనాలతో వెళ్లిన కొంతమందికి ఈ సినిమా నిరాశపరిచి ఉండొచ్చు. అందుకని ఈ సినిమాకి క్రిటికల్ రివ్యూస్ రావచ్చు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళిన వాళ్ళు ఈ సినిమాను స్వప్న దత్ చెప్పినట్లు అద్భుతం అని చెప్పిన కూడా అతిశయోక్తి లేదు.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×