E-Paper
Advertisement

Social Drama OTT : పెళ్ళంటే అసహ్యం… బాయ్ ఫ్రెండ్ మాత్రం కావాలట… నలుగురమ్మాయిల రచ్చ

Social Drama OTT : పెళ్ళంటే అసహ్యం… బాయ్ ఫ్రెండ్ మాత్రం కావాలట… నలుగురమ్మాయిల రచ్చ
Advertisement

Social Drama OTT : సామాజిక విలువలు, సమాజంలో ఉండే మేల్ డామినేషన్ వంటి అంశాలతో వచ్చే సినిమాలు అరుదు. ఇలాంటి సినిమాలను ఓటీటీలో వెతుక్కోవడం కాస్త కష్టమే. లెక్కలేనన్ని సినిమాలు ఉన్న డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఈ జానర్ సినిమాలను వెతకడం అంటే సముద్రంలో ఇసుక రేణువును వెతకడమే. మరి మీరు కూడా అదే పనిలో ఉంటే ఈ మూవీ మీ కోసమే.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

డైరెక్టర్ యశ్వంత్ కిషోర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సోషల్ డ్రామా ‘కన్నగి’ (Kannagi). ఈ సోషల్ థ్రిల్లర్ ఇప్పుడు Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. కీర్తి పాండియన్, అమ్ము అభిరామి, విద్య ప్రదీప్, షాలిన్ జోయా ఇందులో నాలుగు లీడ్ రోల్స్‌లో నటించారు. ఇది కంప్లీట్ గా వుమెన్-సెంట్రిక్ స్టోరీ. సినిమా రిలీజ్ అయినప్పుడు భారీ బజ్ క్రియేట్ చేసింది. నాలుగు విభిన్న సోషల్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చిన మహిళల జీవితాలు, సమస్యలు చుట్టూ కథ సాగుతుంది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్, మ్యారేజ్, డివోర్స్, అబార్షన్ లాంటి సెన్సిటివ్ టాపిక్స్‌ను ఆలోచింపజేసే విధంగా రూపొందించారు.

Advertisement

సపోర్టింగ్ కాస్ట్‌లో అదేష్ సుధాకర్, మాయిల్‌స్వామి, వేత్రి, డైరెక్టర్ యశ్వంత్ కిషోర్ (కేమియో), మౌనిక వంటి వాళ్లు నటించారు. షాన్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ5 ఎంటర్‌టైన్‌మెంట్, స్కైమూన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై జె. ధనుష్, ఎం. గణేష్ ప్రొడ్యూస్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 12న థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్‌డ్ రివ్యూస్ అందుకుంది. కానీ వుమెన్ ఇష్యూస్‌ ను బోల్డ్‌ గా టచ్ చేసినందుకు ప్రశంసలు దక్కాయి.

స్టోరీలోకి వెళ్తే…

ఫస్ట్ స్టోరీ :  కీర్తి పాండియన్ ఇందులో గీత పాత్రలో నటించింది. ప్రెగ్నెన్సీ నాలుగో నెల దాటినా ఇల్లీగల్ గా అబార్షన్ చేయించుకోవాలనుకునే యంగ్ వుమన్. ఆమె ఛాయిస్ వెనుక ఉన్న రీజన్స్, సొసైటీ ప్రెషర్ ఎమోషనల్‌గా చూపిస్తారు.

Advertisement

సెకండ్ స్టోరీ : ఇందులో అమ్ము అభిరామి కలై పాత్రలో నటించారు. ఫ్యామిలీ అరేంజ్డ్ మ్యారేజ్ కోసం ఆమెను సంబంధాలు వచ్చిన కొద్దీ రెడీ చేస్తూ ఉంటారు. మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక ఆమె వరల్డ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.

మూడవ స్టోరీ : షాలిన్ జోయా – మ్యారేజ్ కంటే లివ్-ఇన్ రిలేషన్‌షిప్ బెటర్ అనుకునే యువతి. కంపానియన్‌షిప్, ఇండిపెండెన్స్ కోసం ఈ డెసిషన్ తీసుకుంటుంది. కానీ పార్టనర్ – సొసైటీ నుంచి క్రిటిసిజం, జడ్జ్‌మెంట్ ఎదుర్కొంటుంది.

నాలుగవ స్టోరీ : విద్య ప్రదీప్ – భర్త ఫోర్స్‌డ్ డివోర్స్ తీసుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ఈ అన్యాయాన్ని ఎదిరించి కోర్టుకి వెళ్లి ఫైట్ చేస్తుంది. ఆమె ధైర్యం ఇన్‌స్పైరింగ్.

Read Also :  ఇండియన్ ఓటీటీలో పాపులర్ జపనీస్ యానిమే ఊచకోత… అల్టిమేట్ యాక్షన్ సీన్లు

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×