E-Paper
Advertisement

Swayambhu: ఓటీటీ డీల్ అటకెక్కిందా? డైలమాలో స్వయం భూ రిలీజ్ ..

Swayambhu: ఓటీటీ డీల్ అటకెక్కిందా? డైలమాలో  స్వయం భూ రిలీజ్ ..
Advertisement

Swayambhu: స్పై, అపుడో ఇపుడో ఎపుడో ..అంటూ చేసిన గత రెండు సినిమాలు అడ్డంగా పోవడంతో భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో చేస్తున్న స్వయం భూ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు నికిల్. పై పెచ్చు ఈ సినిమా నికిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ కావడం , పైగా ఎప్పుడూ చేయని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం,క్వాలీటీ  ఎక్కడా మిస్ కావొద్దు అంటూ 170 రోజులకి పైగా షూట్ జరుపుకోవడంతో ట్రేడ్ వర్గాలు కూడా అంచనాలని స్కై లెవెల్ లో పెట్టేసుకున్నాయ్.

ఏప్రిల్ రేసు నుండి తప్పుకునే అవకాశాలు

Advertisement

ఇక ఇందులో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా, నిఖిల్ ఒక పవర్‌ఫుల్ వారియర్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పాన్-ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ పై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. యస్ ..నిజానికి ఈ సినిమాని ఏప్రిల్ 10 తీసుకొస్తామని గతంలో మేకర్స్ ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఈ సినిమా ఏప్రిల్ రేసు నుండి తప్పుకునే అవకాశాలు ఇపుడు పుష్కలంగా కనిపిస్తున్నాయ్.

also read:priyadarshi:ప్రియదర్శి పనైపోయిందా? ‘బలగం’ క్రేజ్ అంతా బూడిదలో పోసిన పన్నీరేనా?

Advertisement

సాధారణంగా ఒక భారీ ప్రాజెక్ట్ థియేటర్లలోకి వచ్చే ముందే డిజిటల్ రైట్స్ నుంచి కొంత రికవరీని ఎక్స్పెక్ట్ చేస్తారు మేకర్స్ ,కానీ కానీ ‘స్వయంభు’ టీమ్ ఎక్స్పెక్ట్ చేసిన రేటుని డీల్ దక్కించుకున్న ZEE5  ఓటీటీ ప్లాట్ ఫామ్ నుండి ఇంకా అందలేదని ఇన్ సైడ్ టాక్. ఇక ఈ డీల్ ఫైనలైజ్ అయితేనే, ఆ మొత్తాన్ని ప్రమోషన్స్ మరియు ఇతర ఖర్చులకు వాడుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

సినిమాని ఉన్నపళంగా రెండు భాగాలు

మరో వైపు ఈ సినిమాని ఉన్నపళంగా రెండు భాగాలుగా (Part-1 & Part-2) అనౌన్స్ చేయడం కూడా బిజినెస్ లెక్కలను తారుమారు చేసిందని తెలుస్తుంది. ఒకే సినిమా అనుకుని డీల్ కుదుర్చుకున్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో ఇప్పుడు రెండు భాగాలకు సంబంధించిన కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవాల్సి వస్తోందట. సో ..ఈ టెక్నికల్ మరియు లీగల్ ప్రాసెస్ వల్ల రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంలో డిలే జరుగుతుందని సమాచారం.

ఇంకో వైపు ఈ సినిమాలో VFX చాలా ఇంపార్టెంట్, రష్ చూసిన తర్వాత గ్రాఫిక్స్ విషయంలో రాజీ పడకూడదని, అవసరమైతే మరికొంత టైం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట నికిల్ .సో ..ఏప్రిల్ 10న సినిమా రావాలంటే ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో సోషల్ మీడియా హోరెత్తిపోవాలి. కానీ ఇప్పటికీ సినిమా నుండి సరైన అప్‌డేట్ లేకపోవడం చూస్తుంటే, ఏప్రిల్ డెడ్‌లైన్‌ను మేకర్స్ దాదాపు వదిలేసినట్టే కనిపిస్తోంది.

ఆగస్టు (Independence Day) లేదా అక్టోబర్ (Dussehra) సీజన్‌

ఇక ఒకవేళ ఏప్రిల్ మిస్ అయితే ఈ సినిమాను ఆగస్టు (Independence Day) లేదా అక్టోబర్ (Dussehra) సీజన్‌కు పోస్ట్‌పోన్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే ఈ లోపు ఓటీటీ డీల్ క్లోజ్ చేసి, పక్కాగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారన్న మాట. చూడాలి భారీ ఆశల్ని పెట్టుకున్న ఈ కుర్ర హీరోకి స్వయం భూ ఎలా కలిసొస్తుందో !

also read:Trolls Target Megastar Chiranjeevi: మెగాస్టార్‌ను టార్గెట్ చేసిన ట్రోల్స్… యాక్షన్‌లోకి సైబర్ క్రైమ్!

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×