E-Paper
Advertisement

US Iran War: ఒకవైపు శాంతి.. మరోవైపు యుద్ధం.. ఇరాన్‌పై ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఇదే!

US Iran War: ఒకవైపు శాంతి.. మరోవైపు యుద్ధం.. ఇరాన్‌పై ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఇదే!
Advertisement

US Iran War: యుద్ధంలో అమెరికా తగ్గినా.. ఇప్పుడు ఇరాన్ తగ్గేలా లేదా? ఎస్.. పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. యుద్ధం మొదలై నాలుగు వారాలు గడిచాక, ఇరాన్ స్థైర్యాన్ని తక్కువ అంచనా వేశామని ట్రంప్ గ్రహించినట్లు కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ నెలకొన్న ఉద్రిక్తతలకు పూర్తి పరిష్కారం కోసం.. అమెరికా, ఇరాన్ మధ్య రెండు రోజుల పాటు మంచి చర్చలు జరిగాయని ట్రంప్ చెప్పిన 24 గంటల్లోపే ఇరాన్ నుంచి వచ్చిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మీ ఓటమిని.. ఒప్పందంగా భావించొద్దని టెహ్రాన్ మిలటరీ కమాండ్ కామెంట్ చేసింది.

ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

ఇది తెలిశాక మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధంపై.. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి మరింత పెరిగింది. చర్చల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలను.. ఇరాన్ సైనిక ప్రతినిధి తోసిపుచ్చారనే వార్తలు కూడా వచ్చాయ్. పశ్చిమాసియాలో స్థిరత్వానికి ఇరాన్ దళాలు హామీ ఇచ్చేంత వరకు, ఆ ప్రాంతంలో పెట్టుబడుల జాడ కనిపించదని, చమురు ధరలు తగ్గడం గానీ జరగదన్నారు. తాము నిర్ణయించే దాకా.. ఎలాంటి పరిస్థితి కూడా మునుపటిలా మారదని ప్రకటించారు. మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా తమ స్టాండ్ ఇదేనని ఇరాన్ క్లియర్‌గా ప్రకటించింది. అమెరికాతో ఎప్పటికీ రాజీపడేది లేదని తెలిపింది. ఇరాన్ విషయంలో అమెరికా చేసిన తప్పులే.. చివరికి బేరసారాలు జరిపే స్థాయికి చేరుకున్నాయని ఇరాన్ అంటోంది.

ఐదు రోజుల విరామం ఆదేశించిన ట్రంప్

Advertisement

వాస్తవానికి, ఇరాన్ ఈ రేంజ్‌లో ప్రతీకారం తీర్చుకుంటుందని అమెరికా అంచనా వేసి ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు, చర్చలు జరుగుతున్నప్పుడే ఫిబ్రవరి 28న అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది. దాంతో.. ఇప్పుడు అగ్రరాజ్యాన్ని ఇరాన్ అంత ఈజీగా నమ్మే పరిస్థితులు లేవు. ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై జరగాల్సిన అన్ని సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని.. యూఎస్ వార్ డిపార్ట్‌మెంట్‌ని ట్రంప్ ఆదేశించినట్లు తెలిపారు. అయితే, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ చెబుతోంది.

ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఆ తర్వాత కూడా.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇరాన్‌తో చర్చలకు నాయకత్వం వహిస్తున్నారని ట్రంప్ చెప్పారు. ఇరాన్ కూడా ఓ ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ దాడుల్లో ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ దెబ్బతిందని చెప్పారు. స్థిరమైన ప్రతిపాదనల ముందుంచితే.. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోగా, ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిగే వార్ ఆపరేషన్స్‌కి మద్దతుగా.. సుమారు 3 వేల మంది సైనికులను మిడిల్ ఈస్ట్‌కు పంపాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయ్.

ఇరాన్‌పై అమెరికా కొత్త వ్యూహం

Advertisement

అమెరికా దౌత్యపరంగా యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నప్పుడు.. ఈ సైనిక సమీకరణ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, ట్రంప్ అన్ని రకాల ఆప్షన్స్ ఓపెన్ చేసి ఉంచుతున్నారనే చర్చ జరుగుతోంది. నాలుగు వారాలుగా యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్‌ని.. సైనిక మోహరింపుతో చర్చల వరకు తీసుకొచ్చేందుకు.. ఒత్తిడి పెంచే వ్యూహంగానూ చెబుతున్నారు. మరోవైపు.. ట్రంప్‌పైనా ప్రెజర్ పెరుగుతోంది. యుద్ధం మొదలై ఇన్నాళ్లవుతున్నా.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను, ఆయుధాలను.. ఇరాన్ బలంగా ఎదుర్కొంటోంది. యుద్ధం మొదలైనప్పుడు.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతం చేస్తే.. ఇరాన్ వ్యవస్థలో గందరగోళం తలెత్తి, మతపరమైన పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో నిరసనలు వెల్లువెత్తుతాయని, అది కాస్తా అధికార మార్పిడికి దారితీస్తుందని అమెరికా లెక్కలేసుకుంది. కానీ, ఇవేవీ జరగలేదు.

గల్ఫ్ దేశాలపై దాడులు

సుప్రీం లీడర్‌ని కోల్పోయినా.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పూర్తి స్థాయిలో ఎదురుదాడిని కొనసాగించింది. అంతేకాదు, ఇరాన్.. ట్రంప్ ఊహించని మరో పని చేసింది. గల్ఫ్‌ రీజియన్‌లో అమెరికా మిత్ర దేశాలని టార్గెట్‌ చేసింది. ఇరాన్.. ఈ దేశాల్లో దాడులు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అరబ్ దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్న తమ ఆర్థిక వ్యవస్థలకు ముప్పు కలిగేలా యుద్ధం మొదలుపెట్టొద్దని.. గతంలోనే ట్రంప్ ప్రభుత్వాన్ని కోరాయ్. ఇరాన్ కౌంటర్ ఎటాక్స్, అమెరికా మిత్ర దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి.. అమెరికా ప్రెసిడెంట్‌ని ఇరకాటంలో పడేశాయ్. ఈ దశలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సిద్ధం లేదు. కానీ, సమయం మించిపోతోందని ట్రంప్‌కు బాగా తెలుసు. తను మొదలుపెట్టిన యుద్ధాన్ని, తనే ముగించి.. గొప్పగా చెప్పుకునేందుకు ట్రంప్ ఏదైనా సాధించాలి. కానీ.. ఇరాన్ అంత ఛాన్స్ ఇవ్వడం లేదు.

అమెరికా అంచనాలు తప్పాయా?

యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ పదే పదే ఒకే మాట చెబుతున్నాయ్. ఇరాన్ సైనిక సామర్థ్యం క్షీణించిపోయిందని! తమ దాడుల్లో.. ఇరాన్ మిలటరీ కమాండ్ వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ఎదురుదాడి చేసే సామర్థ్యం పూర్తిగా బలహీనపడిందని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. అమెరికా అంచనాలు ప్రకారం.. యుద్ధం ఇప్పటికే ముగింపు దశలో ఉండాలి. కానీ.. వార్ గ్రౌండ్‌లో రియాలిటీ.. విరుద్ధంగా కనిపిస్తోంది. నాలుగు వారాల నిరంతర దాడుల తర్వాత ఉద్రిక్తతలు తగ్గాల్సిందిపోయి.. మరింత పెరుగుతున్నాయ్. యుద్ధం నుంచి బయటపడేందుకు స్పష్టమైన మార్గాలు కూడా మూసుకుపోయే స్థితిలో ఉన్నాయ్. ఈ క్రమంలో.. ట్రంప్ ప్రభుత్వం యుద్ధాన్ని ముగించేందుకు చర్చల ప్రస్తావన తెస్తోంది. అందుకోసమే.. 15 అంశాలతో ప్రతిపాదనలు పంపిందనే రిపోర్టులు వస్తున్నాయ్. ఈ లిస్ట్‌లో.. ఏడాది క్రితం ఇరాన్ తిరస్కరించిన అంశాలే చాలా వరకు ఉన్నాయంటున్నారు.

ఖమేనీ తర్వాత కూడా కఠిన వైఖరి

ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపడానికి ఇరాన్ సిద్ధంగా లేదు. కానీ, ఓ మెరుగైన ఒప్పందం కోసం ఆ దేశం పోరాటం కొనసాగించే అవకాశాలున్నాయ్. టెహ్రాన్‌పై ఏడాదిలో రెండుసార్లు దాడి జరిగింది. ఇప్పుడు.. అయతొల్లా అలీ ఖమేనీ కూడా అంతమయ్యారు. అందుకని.. ఇరాన్ నాయకత్వం లొంగిపోయినట్లుగా అనిపించకూడదు. అదే సమయంలో.. భవిష్యత్తులో మళ్లీ దాడులు జరిగే పరిస్థితులు ఉండకూడదు. అంతకుమించి.. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించే అవకాశం లేదు. ఇప్పటికే.. ఇరాన్ హర్మూజ్ జలసంధిని స్తంభింపజేసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, కీలక మార్కెట్లలో ఇంధన భద్రతకు ముప్పు తెచ్చింది. అందువల్ల.. ఈ యుద్ధాన్ని సాగదీసి, తమ భద్రతకు హామీ ఇచ్చే మెరుగైన ఒప్పందం కోసం బేరసారాలు జరిపేందుకు ఇరాన్‌కు ఇప్పుడే మంచి అవకాశాలున్నాయ్.

యుద్ధం దెబ్బకు నగరాలు శిథిలాలు

కానీ.. ఎక్కువరోజులు యుద్ధం కొనసాగితే.. ఇరాన్ మరింత నష్టపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు. అందువల్ల.. ఇరాన్ కూడా యుద్ధం నుంచి బయటపడే మార్గాన్ని కనుగొనాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇప్పటికే, యుద్ధంలో 15 వందల మందికి పైగా ప్రజలు మరణించారు. కీలక నగరాలు, ప్రదేశాలు, స్థావరాలు దెబ్బతిన్నాయ్. ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరిగిపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి 9 కోట్ల మందికి పైగా ప్రజలు ఇంటర్నెట్‌ని వినియోగించకుండా ప్రభుత్వం నిరోధిస్తోంది. ఈ పరిస్థితులతో.. నెమ్మదిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు కూడా మొదలవుతోందనే రిపోర్టులు వస్తున్నాయ్.

నాయకత్వ మార్పు ప్లాన్ ఫెయిల్

ఇరాన్‌లో అత్యున్నత నాయకత్వాన్ని తొలగిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుందనే అంచనా తప్పింది. పైగా, ఇప్పుడు చర్చలు ఎవరితో జరపాలి? అనేది కూడా కన్ఫ్యూజన్‌కి దారితీస్తోంది. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ ఇప్పటివరకు చాలా లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. యుద్ధం మొదలైన తర్వాత.. ఇరాన్ దాడులతో ప్రభావితమైన గల్ఫ్ దేశాలకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఇది.. ఐర్‌జీసీలోని కొన్ని వర్గాలకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. మొజ్తబా ఖమేనీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. మసూద్ చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. ఇది దౌత్యపరమైన మార్గాలను మరింత పరిమితం చేస్తోంది. ప్రస్తుతం ట్రంప్ దాడులను నిలిపివేశారు.

ఇరాన్ వెనక్కి తగ్గదు… అమెరికా ప్లాన్ ఏంటి?

కానీ, ఇది ఎంతకాలం ఉంటుందనే దానిపై క్లారిటీ లేదు. ఇరుపక్షాల చర్చలకు దారులు మూసుకుపోతున్న వేళ.. ట్రంప్ దగ్గరున్న ప్రత్యామ్నాయాలు కూడా తగ్గిపోతున్నాయ్. ఇరాన్ కూడా బలహీనంగా కనిపించకుండా ఉండేందుకు.. వెనక్కి తగ్గే అవకాశం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ కేవలం ఎయిర్‌ఫోర్స్‌తో యుద్ధాన్ని గెలిచే పరిస్థితులు లేవు. దాంతో.. మున్ముందు ఏం జరగబోతోంది? యుద్ధానికి ముగింపు పలికేలా చర్చలు జరుగుతాయా? లేదా? అనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

Also Read: హిస్టరీ రిపీట్స్.. ఇరాన్ విషయంలో ట్రంప్ చేస్తున్న పొరపాటు కెన్నెడీ నాటిదేనా?

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×