E-Paper
Advertisement

Tamannaah Bhatia తెలుగు సినిమాలకు దూరం పెట్టాలనుకుంటున్న తమన్నా..!

Tamannaah Bhatia తెలుగు సినిమాలకు దూరం పెట్టాలనుకుంటున్న తమన్నా..!
Advertisement

Tamannaah Bhatia:  స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా మరోసారి వార్తల్లో నిలిచింది. నిన్న మొన్నటి వరకు ఐటం సాంగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ స్టార్ హీరోయిన్.. ఈసారి కెరీర్‌పై తీసుకుంటున్న కీలక నిర్ణయాల‌ వల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా ఏళ్లుగా తెలుగు, తమిళ సినిమాల్లో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగిన తమన్నా.. ఇప్పుడు దక్షిణాది సినిమాలకు కొంత దూరంగా ఉండాలని భావిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో..ముఖ్యంగా రెడ్డిట్, ఎక్స్ (ట్విట్టర్) లాంటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ విషయం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. తమన్నా ఇకపై రొటీన్ పాత్రలు చేయకూడదని..తనకు నటనకు అవకాశం ఉన్న పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే ఆమె బాలీవుడ్‌లో మంచి ప్రాజెక్టుల కోసం చూస్తోందనే టాక్ వినిపిస్తోంది.
వచ్చే రోజుల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కే లవ్ అండ్ వార్, కరీనా కపూర్ నటించే క్రూ 2, గోల్‌మాల్ 5..అలాగే మ్యాడాక్ సంస్థ హారర్–కామెడీ యూనివర్స్ సినిమాల్లో తమన్నా కనిపించవచ్చని ప్రచారం సాగుతోంది. అయితే ఇవన్నీ ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.
ఇదే సమయంలో కార్తీక్ ఆర్యన్ నటించే నాగ్‌జిల్లా సినిమా నుంచి ఆమె తప్పుకుందని వార్తలు వచ్చాయి. షూటింగ్ డేట్స్ సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఆమె కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్లాలనే ఆలోచనలో భాగమేనని చెబుతున్నారు.
2026లో విడుదల కానున్న సినిమాల విషయానికి వస్తే, తమన్నా బాలీవుడ్‌లో బిజీగా ఉండబోతోంది. షాహిద్ కపూర్‌తో కలిసి ఓ రోమియో, సిద్ధార్థ్ మల్హోత్రాతో వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ద ఫారెస్ట్, అలాగే జాన్ అబ్రహాం నటించే రాకేశ్ మారియా బయోపిక్‌లో ఆమె కీలక పాత్రలు చేయనుంది. ఇక తమిళంలో విశాల్ తో కూడా ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమానే తెలుగులో మొగుడు పేరుతో విడుదల కానుంది. దీంతో తమన్నా కేవలం తెలుగు సినిమాలు మాత్రమే ఒప్పుకోవడం లేదు అని వినికిడి. అయితే అందుకు ముఖ్య కారణం ఇక్కడ ఆమెకు పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు రాకపోవడం అని.. అందుకే తమన్నా తెలుగు సినిమాలను దూరం పెట్టాల్సి వస్తోంది అని తెలుస్తోంది.

Advertisement

ఇక దక్షిణాదిలో దాదాపు ఏడు తెలుగు, తమిళ సినిమాలను ఆమె తిరస్కరించిందని సమాచారం. కారణం ఒక్కటే… “ఫ్లవర్‌పాట్ పాత్రలు వద్దు” అన్న నిర్ణయం. రజనీకాంత్ నటించే ‘జైలర్ 2’లో ఆమె చిన్న పాత్ర కూడా అనిశ్చితంగా మారిందని వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి తమన్నా తీసుకుంటున్న ఈ మార్పు ఆమె కెరీర్‌కు కొత్త ఊపునివ్వవచ్చని అభిమానులు భావిస్తున్నారు. 2026 ఆమెకు కొత్త గుర్తింపు తీసుకువచ్చే సంవత్సరం అవుతుందేమో చూడాలి.

Advertisement

ALSO READ: Mark OTT: కిచ్చా సుదీప్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఎప్పటినుంచి చూడొచ్చంటే..!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×