E-Paper
Advertisement

Netflix Trending Movies: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు హీరోల హవా.. రికార్డ్ వ్యూస్ సాధించిన సినిమాలు ఇవే..!

Netflix Trending Movies: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు హీరోల హవా.. రికార్డ్ వ్యూస్ సాధించిన సినిమాలు ఇవే..!
Advertisement

Netflix Trending Movies: నేటి కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రేక్షకుల సినిమా చూసే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. థియేటర్‌కు వెళ్లకపోయినా, ఇంట్లో కూర్చొని కొత్త సినిమాలు చూడాలనే ఆసక్తి రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ మార్పులో తెలుగు సినిమాలు కూడా వెనుకబడలేదు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తెలుగు సినిమాలు భారీ సంఖ్యలో వ్యూస్ సాధిస్తూ దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు.. తెచ్చుకుంటున్నాయి. తాజాగా విడుదలైన నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన తెలుగు సినిమాల జాబితా తెలుగు ప్రేక్షకుల అభిరుచిని.. స్టార్ హీరోల క్రేజ్‌ను..అలాగే కంటెంట్‌కు ఉన్న బలాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

ఈ జాబితాలో మొదటి స్థానంలో ఆర్‌ఆర్‌ఆర్.. నిలిచింది. హిందీ వెర్షన్‌లో మాత్రమే ఉన్నప్పటికీ ఈ సినిమా 4 కోట్ల 50 లక్షలకుపైగా వ్యూస్ సాధించడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సినిమాల స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

Advertisement

రెండో స్థానంలో లక్కీ భాస్కర్ ఉంది. ఈ సినిమా 2 కోట్ల 95 లక్షల వ్యూస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణ కథతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఈ సినిమా నిరూపించింది. మూడో స్థానంలో హాయ్ నాన్న ఉంది. కుటుంబ భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రం 2 కోట్ల 10 లక్షల వ్యూస్ పొందింది.

నాలుగో స్థానంలో పుష్ప 2 నిలిచింది. అల్లు అర్జున్ క్రేజ్ ఈ సినిమా వ్యూస్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఐదో స్థానంలో గుంటూరు కారం,
ఆరవ స్థానంలో సలార్ హిందీ లేకుండా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏడో స్థానంలో దేవర, ఎనిమిదో స్థానంలో హిట్ 3, తొమ్మిదో స్థానంలో సరిపోదా శనివారం ఉన్నాయి. ఈ సినిమాలు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పించాయి.

Advertisement

పదో స్థానంలో కల్కి 2898 ఏడీ (హిందీ మాత్రమే) నిలిచింది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా ఓటీటీలో మంచి ఆదరణ పొందింది.
అలాగే కోర్టు, ఖుషి, దాకూ మహారాజ్, గాడ్‌ఫాదర్, కింగ్డమ్ వంటి సినిమాలు కూడా టాప్ లిస్ట్‌లో ఉన్నాయి.

జాబితా చివర్లో ఓజీ, భోళా శంకర్, దసరా, తండేల్, వాల్తేర్ వీరయ్య, బ్రో, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లక్షల సంఖ్యలో వ్యూస్ సాధించాయి.

మొత్తంగా చూస్తే,..ఈ జాబితా తెలుగు సినిమాల ఓటీటీ బలం ఎంత పెరిగిందో స్పష్టంగా చూపిస్తోంది. థియేటర్‌లో కాకుండా ఇంట్లో కూర్చొని చూసే ప్రేక్షకులు కూడా తెలుగు సినిమాలను విపరీతంగా ఆదరిస్తున్నారు.

ALSO READ: Eesha Rebba: రెడ్ డ్రెస్ లో అందాలతో హీట్ పుట్టిస్తున్న ఈషా రెబ్బా!

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×