E-Paper
Advertisement

Nagarjuna: గుడ్ న్యూస్ చెప్పబోతున్న అక్కినేని హీరో.. తాత కాబోతున్న నాగార్జున!

Nagarjuna: గుడ్ న్యూస్ చెప్పబోతున్న అక్కినేని హీరో.. తాత కాబోతున్న నాగార్జున!
Advertisement

Nagarjuna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు లెగసీని కంటిన్యూ చేస్తూ నాగార్జున(Nagarjuna) స్టార్ హీరోగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు ఇప్పుడు నాగార్జున వారసులుగా నాగచైతన్య అఖిల్ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ అఖిల్ మాత్రం సక్సెస్ కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలా అక్కినేని హీరోలందరూ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

తాతగా ప్రమోట్ అవుతున్న నాగార్జున?

ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా అక్కినేని కుటుంబం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. నాగార్జున తన ఇద్దరి కొడుకులకు ఇటీవల పెళ్లి చేసిన సంగతి తెలిసిందే అయితే త్వరలోనే నాగార్జున తాతయ్య కాబోతున్నారు అంటూ ఓ వార్త బలంగా వినపడుతోంది. ఈ వార్తలను అక్కినేని కుటుంబ సభ్యులు ఎక్కడ ఖండించలేదు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నాగార్జునకు ఇదే ప్రశ్న ఎదురైనది. మీరు తాతయ్య కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో బాగా వార్తలు వస్తున్నాయి నిజమేనా అంటు నాగార్జునకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు నాగార్జున చెప్పిన సమాధానం విన్న అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా..

Advertisement

ఈ ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ.. ఈ విషయం గురించి సరైన సమయం వచ్చినప్పుడు స్వయంగా నేనే తెలియజేస్తాను అంటూ మాట్లాడటంతో అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వార్తలలో నిజం లేకపోతే నాగార్జున స్వయంగా అలాంటిదేమీ లేదు అంటూ ఈ వార్తలను ఖండిస్తారు. అలా కాకుండా నాగార్జున స్వయంగా నేనే సమయం వచ్చినప్పుడు చెబుతా అని మాట్లాడటంతో కచ్చితంగా త్వరలోనే అక్కినేని కాంపౌండ్ నుంచి గుడ్ న్యూస్ రాబోతుందని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తల్లి కాబోతున్న శోభిత?

Advertisement

ఇక నాగచైతన్య శోభిత వివాహం జరిగి ఏడాది పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వినపడుతున్నాయి.. నాగచైతన్య శోభిత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఇక నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వృషకర్మ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ ఏడాది మొదట్లో అఖిల్ జైనబ్ అనే అమ్మాయితో వివాహం జరుపుకున్నారు. అఖిల్ కూడా లెనిన్ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

Also Read: Hyper Aadi: పెళ్లికి క్యాస్ట్ కావాలి కానీ.. అక్రమ సంబంధాలపై హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు!

Related News

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

Big Stories

Advertisement
×