Thalapathy Vijay vs Prabhas: అమెరికా బాక్సాఫీస్ దగ్గర.. జనవరి 9న భారీ క్లాష్ జరగబోతోంది. రెండు భారీ సినిమాలు ఒకే రోజు ప్రీమియర్‌కు రెడీ అవుతున్నాయి. అవే విజయ్ హీరోగా వస్తున్న Jana Nayagan.. మరోతి ప్రభాస్ హీరోగా వస్తోందా The Raja Saab. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఈ రెండు సినిమాలు అమెరికాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంకా తొమ్మిది రోజులు సమయం ఉండగానే వచ్చిన బాక్సాఫీస్ నంబర్లు.. ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో ఏది మొదటి స్థానం సంపాదిస్తుంది అన్న ఆసక్తి అందరిలో ఉంది.
జనా నాయకన్ సినిమా అమెరికాలో మంచి స్పీడ్‌తో ముందుకు వెళ్తోంది. ఇప్పటివరకు 195 లొకేషన్లలో 419 ప్రీమియర్ షోలు ఓపెన్ అయ్యాయి. వీటిలో మొత్తం 11,291 టికెట్లు అమ్ముడయ్యాయి. దీని ద్వారా సుమారు 2.30 లక్షల డాలర్లు వసూలయ్యాయి. ఇంకా షోలు, లొకేషన్లు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే మొత్తం నార్త్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ కలెక్షన్లు ఇప్పటికే 3 లక్షల డాలర్ల మార్క్‌ను దాటాయి. ప్రమోషన్లు పెరిగే కొద్దీ చివరి వారం మరింత జోరు కనిపిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.
రాజా సాబ్ సినిమా మరో స్ట్రాటజీతో ముందుకెళ్లింది. ఈ సినిమాకు అమెరికాలో చాలా విస్తృతంగా రిలీజ్ ప్లాన్ చేశారు. 342 లొకేషన్లలో ఏకంగా 1,021 ప్రీమియర్ షోలు ఓపెన్ అయ్యాయి. ఇప్పటివరకు 9,899 టికెట్లు అమ్ముడై, సుమారు 2.80 లక్షల డాలర్ల గ్రాస్ వచ్చింది. మొత్తం అడ్వాన్స్ కలెక్షన్లు దాదాపు 2.90 లక్షల డాలర్ల వద్ద ఉన్నాయి. టికెట్ల సంఖ్య కొంచెం తక్కువగా కనిపించినా, షోల సంఖ్య ఎక్కువగా ఉండటం డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమాపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. సాధారణంగా ఇలాంటి సినిమాలు చివరి వారం భారీ జంప్ ఇస్తాయి.
మొత్తంగా చూస్తే, ఈ రెండు సినిమాలు అమెరికాలో బలమైన ఓపెనింగ్‌కు రెడీగా ఉన్నాయి. ఒకటి టికెట్ కౌంట్‌లో ముందుంటే.. మరోటి షో కౌంట్‌తో దూసుకుపోతోంది. చివరి వారం బుకింగ్స్‌తో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. జనవరి 9 తర్వాత అసలు విజేత ఎవరో స్పష్టంగా తెలుస్తుంది.
ALSO READ: Prabhas New Movie : ఫిబ్రవరిలో సెట్స్‌పైకి మరో సినిమా.. డార్లింగ్‌కు అసలు గ్యాప్ లేదు