E-Paper
Advertisement

Jana Nayagan Censor : విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ రిపొర్ట్.. మూవీ ఎన్ని గంటలు ఉందంటే?

Jana Nayagan Censor : విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ రిపొర్ట్.. మూవీ ఎన్ని గంటలు ఉందంటే?
Advertisement

Jana Nayagan Censor : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న చివరి చిత్రం జన నాయగన్. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. హెచ్ వినోద్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక విజయ్ కు చివరి సినిమా కావడం తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్ర యూనిట్.. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ని విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమా రన్ టైం ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాం..

‘జన నాయగన్ ‘ రన్ టైం ఎంతంటే..?

విజయ్ దళపతి ఈ సినిమా తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇదే చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో పాటుగా భారీ కథనంతో రాబోతున్న ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది.. ఈ క్రమంలో మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం 2 గంటల 45 నిమిషాలు ఉండనుంది.. అలాగే ఈ మూవీ చివరి 20 నిమిషాలు సీన్లను కూడా యాడ్ చెయ్యగా.. మొత్తం ఈ సినిమా 3 గంటల 5 నిమిషాల రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. మూవీ నుంచి బయటకు వచ్చినా ప్రతి అప్డేట్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.   మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పిస్తుందో చూడాలి..

Advertisement

Also Read : శివాజీ వ్యాఖ్యల పై నాగబాబు సీరియస్.. డ్రెస్సింగ్ గురించి మాట్లాడే హక్కు లేదు..

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

‘జన నాయగన్’ బలమైన రాజకీయ నేపథ్యం, మంచి సస్పెన్స్ యాక్షన్ కథాంశంతో ఉంటుందని ఇది స్పష్టం చేస్తుంది.. రెండు సిద్ధాంతాల మధ్య నేపథ్యంలో స్టోరీ ఉండబోతుందని అప్డేట్స్ ను చూస్తే అర్థమవుతుంది. అలాగే విజయ్ రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా సినిమా కథను రాసుకున్నట్టు తెలుస్తోంది.. డిఫరెంట్ ఆలోచనలు ఉన్న ఇద్దరు ప్రత్యర్థుల మధ్య సంఘర్షణ జననాయగన్ సినిమా.. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. అతనికి విజయ్ చివరి సినిమా డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇందులో మమితా బైజు, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, మోనిషా బ్లెసీ, ప్రియమణి, ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖులు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. మరోవైపు దళపతి విజయ్.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే తన సొంత పార్టీ పేరును కూడా అనౌన్స్ చేశారు. త్వరలోనే మరో సమావేశం ఏర్పాటు చెయ్యనున్నారని సమాచారం. ఇకపోతే సినిమాల్లో స్టార్ ఇమేజ్ ను అందుకున్న విజయ్ రాజకీయాల్లో సక్సెస్ అవుతాడో.. లేదో చూడాలి..

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×