E-Paper
Advertisement

NagaBabu : శివాజీ వ్యాఖ్యల పై నాగబాబు సీరియస్.. డ్రెస్సింగ్ గురించి మాట్లాడే హక్కు లేదు..

NagaBabu : శివాజీ వ్యాఖ్యల పై నాగబాబు సీరియస్.. డ్రెస్సింగ్ గురించి మాట్లాడే హక్కు లేదు..
Advertisement

NagaBabu : టాలీవుడ్ నటుడు శివాజీ దండోరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళలను ఉద్దేశిస్తూ డ్రెస్సింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం. ఆయన మాటలు కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారి తీశాయి. శివాజీ వ్యాఖ్యలను కొందరు తీవ్రంగా ఖండిస్తుండగా, మరికొందరు మాత్రం ఆయన మాట్లాడిన తీరు తప్పుగాని చెప్పినా ఉద్దేశం మాత్రం కరెక్టే అంటూ సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంత పెద్ద దుమారం రేపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే శివాజీ వ్యాఖ్యలపై పలువురు సినీనటులు స్పందించారు. అనసూయ, సింగర్ చిన్మయి, అలాగే మంచు మనోజ్ లు మహిళల డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేసే హక్కు ఎవరికి లేదంటూ పోస్ట్ లు పెట్టారు. తాజాగా జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు శివాజీ వ్యాఖ్యలపై స్పందించారు.. తన సోషల్ మీడియా వేదికగా నాగబాబు ఒక వీడియోని రిలీజ్ చేశారు. మహిళల వస్త్రధారణ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యల పై ఆయన తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

శివాజీ పై నాగబాబు తీవ్ర ఆగ్రహం..

సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు శివాజీ మహిళల పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పై తాజాగా స్పందించారు. తన సోషల్ మీడియాలో ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మహిళలపై ఇటీవల చాలామంది తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రీసెంట్ గా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. మహిళల గురించి మాట్లాడే అధికారం ఏ ఒక్కరికి లేదు. ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పే హక్కు ఎవరికీ లేదు.భారతదేశంలో మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధం. మనము ఏ లోకంలో ఉన్నామో అర్థం కావడం లేదు.. అమ్మాయిలు ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని రూల్స్ పెట్టడం ఎవరికీ హక్కు లేదు.. మోడ్రన్ గా ఉండాలనుకోవడం తప్పులేదు కదా వాటి గురించి నువ్వు ఇలానే ఉండాలి నువ్వు ఇలానే చేయాలి అని అనడం తప్పు అని నాగబాబు అన్నారు. వాళ్ళ డ్రెస్సుల్ని బట్టి వాళ్లపై అగైతాలు జరుగుతున్నాయి అనడం తప్పు. సమాజంలో ఉండే మృగాలు కామంతో వాళ్లపై దాడి చేస్తున్నారు. మీరు ఈ విషయం గురించి ఎక్కడైనా తెలుసుకోండి. మహిళల గురించి వాళ్ళ దుస్తుల గురించి ఎప్పుడూ ఎవరు అనే హక్కు అధికారం లేదు అని ఆయన ఆ వీడియోలో అన్నారు. మగాళ్లు చూసే కామదృష్టి వల్లే మహిళలకు రక్షణ లేకుండా పోతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి.. సమాజంలోని జనాలు కూడా ఈ విషయాన్ని గమనిస్తే బాగుంటుంది అని నాగబాబు అన్నారు.. మొత్తానికి ఈ వీడియోతో శివాజీకి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ ఇచ్చారు నాగబాబు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Advertisement

Also Read : నేడు మహిళ కమీషన్ ముందు హాజరుకానున్న నటుడు శివాజీ..

అమ్మాయిలకు నాగబాబు సలహాలు..

అమ్మాయిలు మీ డ్రెస్ గురించి మాట్లాడే అధికారం ఎవరికి లేదు మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి. మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి.. అయితే మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా మీరు ధైర్యంగా ఉండాలి. రక్షణ కోసం సహాయం చేసే విద్యలను మీరు నేర్చుకోవాలి. సమాజంలో దుర్మార్గులు ఉన్నారు వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ప్రయత్నించాలి.. స్వేచ్ఛ, గౌరవం, గోప్యత, సమానత్వం వంటి మౌలిక హక్కులను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21 కింద హరించేస్తుందని కోర్టులు పునరావృతంగా తీర్పులు ఇచ్చాయి.  మీరు మీ ఇష్టం వచ్చిన లైఫ్ ను బ్రతకండి అని ఆ వీడియోలో నాగబాబు అన్నారు..ఈ వీడియో నెట్టింట  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగబాబు వీడియో పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ, కామెంట్లు పెడుతున్నారు.. మరి నాగబాబు వ్యాఖ్యలపై నటుడు శివాజీ ఎలా స్పందిస్తారు చూడాలి…

Advertisement

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×