E-Paper
Advertisement

ఒక్కరూపాయి తీసుకోకుండా సినిమాలో నటించిన హీరోయిన్లు.. ఏ మూవీలో చేశారంటే..?

ఒక్కరూపాయి తీసుకోకుండా సినిమాలో నటించిన హీరోయిన్లు.. ఏ మూవీలో చేశారంటే..?
Advertisement

Heroines : సినిమాల్లో నటించే నటీనటులు కేవలం డబ్బులు కోసమే నటిస్తారని చాలామంది అనుకుంటూ ఉంటారు.. కొన్ని కారణాలవల్ల సినిమాల్లోకి వచ్చిన సరే వాళ్ళ వేషధారణ బట్టి తప్పుగా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏ పని చేసినా కూడా డబ్బులు కోసమే.. ప్రస్తుతమున్న రోజుల్లో డబ్బుకున్న విలువ మనుషులకి లేదని చెప్పాలి.. ఇలాంటి రోజుల్లో కూడా కొంతమంది హీరోయిన్లు కొన్ని సినిమాలలో నటించారు. హీరోయిన్ల సినిమాలలో నటిస్తారు కదా ఇందులో వింత ఏమిటి అని అనుకుంటున్నారు కదూ.. అవును అసలు పాయింట్ ఏంటంటే సినిమాలకు ఎటువంటి పారితోషకం కూడా తీసుకోకుండా నటించడం అంటే అది మామూలు విషయం కాదు. తమకున్న అభిమానం వల్ల కొంతమంది హీరోయిన్లు ఉచితంగా సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అయితే ఆ హీరోయిన్లు ఎవరో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిన హీరోయిన్లు..

ప్రియమణి..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కలేని పేరు ప్రియమణి.. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. ఈమధ్య తన వయసుకు తగ్గ పాత్రలు అలాగే వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. అయితే ప్రియమణి ఒక సినిమాలో నటించి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తుంది. ఇంతకీ ప్రియమణి ఏ హీరో సినిమాలో నటించిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో ప్రియమణి షారుక్ ఖాన్ తో కలిసి స్టెప్పులేసింది.. ఆయన మీద కేవలం అభిమానంతోనే ఆ సినిమా చేసినట్లు ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. అందుకే ఈ సినిమాకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.. ప్రస్తుతం ప్రియమణి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది..

మృణాల్ ఠాకూర్..

Advertisement

సీతారాం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ మృణాల ఠాకూర్.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకొని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఈ అమ్మడు ప్రభాస్ నటించిన కల్కి మూవీలో రోల్ చేసింది.. అయితే ఆ సినిమా కోసం ఆమె ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తుంది.. ఈ చిత్రాన్ని నిర్మించిన వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ పై ఉన్న అభిమానంతోనే రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం మృణాల్  సినిమాల విషయానికి వస్తే.. ఈమధ్య ఈమె చేస్తున్న సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదని చెప్పనక్కర్లేదు.. దాంతో కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈమె తెలుగులో మాత్రమే కాదు వేరే భాషలలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు తెగ ట్రై చేస్తుంది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×