E-Paper
Advertisement

Serial Actress : సీరియల్స్ లో నటించి సినిమాల్లో బిజీ అయిన స్టార్ట్స్ ఎవరంటే..?

Serial Actress : సీరియల్స్ లో నటించి సినిమాల్లో బిజీ అయిన స్టార్ట్స్ ఎవరంటే..?
Advertisement

Serial Actress : అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టమే.. ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న చాలామంది ఇప్పుడు సినిమాలలో బిజీ స్టార్స్ గా మారిపోయారు.. ఒకవైపు కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉద్యోగాలు చేస్తూ మరోవైపు తమకు ఇష్టమైన నటన కోసం ఎన్నో ప్రయత్నాలు చేసే సక్సెస్ అయ్యి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్నారు.. ఇకపోతే సీరియల్స్ ద్వారా చాలామంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలలో నటిస్తూ బిజీగా మారిన నటులు చాలామంది ఉన్నారు.. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినిమాలలో బిజీగా ఉన్న యాక్టర్స్ ఎవరో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీరియల్ యాక్టర్స్.. 

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలల్లో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయి.. ఎప్పుడూ ఏడాదికి ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించే సినిమా స్టార్స్ కన్నా ప్రతిరోజు టీవీలలో కనిపించే సీరియల్ స్టార్స్ కి క్రేజ్ ఎక్కువ. బుల్లితెరపై ప్రసారమైన పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్న యాక్టర్స్ కొంతమంది ఇప్పుడు సినిమాలలో హీరో హీరోయిన్గా రాణిస్తూ తమ లైఫ్ని బిజీగా గడుపుతున్నారు. అందులో కొంతమంది గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జ్యోతి రాయ్.. 

Advertisement

స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది జ్యోతి రాయ్.. ఆ సీరియల్ లో హీరో రిషి తల్లి జగతి మేడం పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో ఈమె చేసింది ఒకే సీరియల్ అయినా సరే ఈమె క్రేజ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ సీరియల్ చేస్తుండగానే ఆమె బుల్లితెర సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసి వెండితెరపై అడుగు పెట్టింది. నాజుగ్గా మారి వరసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ ని మించిన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..

రవికృష్ణ..

తెలుగు సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న బుల్లితెర నటుడు రవి కృష్ణ. తెలుగులో ఎన్నో సీరియల్స్లలో నటించి నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.. అయితే ఈయన సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసి సినిమాల్లోకి ఎంటర్ ఇచ్చేసాడు.. ఈమధ్య పలు సినిమాలలో నటిస్తూ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన కేవలం సినిమాలపై మాత్రమే ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది..

ముకేష్ గౌడ..

Advertisement

స్టార్ మా లో ప్రసారమైన గుప్పెడంత సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో హీరో పాత్రలో నటించిన రిషి అలియాస్ ముఖేష్ గౌడ గురించి అందరికీ తెలుసు.. ఈయన తెలుగు ఇండస్ట్రీలోని నటుడు కాకపోయినా సరే తెలుగులో మంచి క్రేజ్ ను సొంత చేసుకున్నాడు.. ఈయన కూడా ఒక్క సీరియల్ తోనే బుల్లితెరకి గుడ్ బై చెప్పేసి సినిమాలపై ఫోకస్ పెట్టాడు.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

వీళ్లు మాత్రమే కాదు ఎంతో మంది సీరియల్ యాక్టర్స్ సీరియల్స్లలో నటులుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ప్రస్తుతం సినిమాలలో బిజీగా మారేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.. హీరోలు హీరోయిన్లుగా మాత్రమే కాదు ప్రొడ్యూసర్లుగా డైరెక్టర్లుగా కూడా మారి తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు..

Related News

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Gundeninda GudiGantalu Today episode: పాపం మీనా… ప్రభావతి ఫుల్ హ్యాపీ.. మేనేజర్ కుట్రతో మీనా బలి..

Podarillu Today Episode : చక్రి ప్లాన్ చెడగొట్టిన నారాయణ.. చక్రి గిఫ్ట్ కు మహా ఫిదా.. దేవతలాగా ఉంది..

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య.. వల్లి కోరిక తీరింది.. భద్రకు ఫిట్టింగ్ పెట్టిన వల్లి.. ధీరజ్ కు షాక్..

Brahmamudi Serial Today Episode July 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు కోసం ధర్నాకు దిగిన ఇందు 

Intinti Ramayanam Today Episode: పల్లవికి ఘోర అవమానం.. అవనికి అడ్డంగా దొరికిన పల్లవి.. స్ట్రాంగ్ వార్నింగ్..

Big Stories

Advertisement
×