E-Paper
Advertisement

The Kerala Story 2: ది కేరళ స్టోరీ 2 పై హైకోర్టు కీలక తీర్పు..‌ సినిమా విడుదల ఉందా.. లేదా.. అంటే..!

The Kerala Story 2: ది కేరళ స్టోరీ 2 పై హైకోర్టు కీలక తీర్పు..‌ సినిమా విడుదల ఉందా.. లేదా.. అంటే..!
Advertisement

The Kerala Story 2: ది కేరళ స్టోరీ 2 సినిమా విడుదలపై కోర్టు కీలక తీర్పు ప్రకటించింది. కేరళ స్టోరీ 2 – గోస్ బియాండ్ అనే ఈ సినిమాపై ముందుగా స్టే పడగా, తాజాగా కేరళ హైకోర్టు.. కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఈ చిత్రం విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనా లేదా.. అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళ స్టోరీస్ 2 సినిమాను విడుదల చేయవద్దంటూ దాఖలైన పిటిషన్లపై ముందుగా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ బెచ్చు కురియన్ థామస్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. సినిమా టీజర్, ట్రైలర్ ఆధారంగా ఇది కేరళను తప్పుగా చూపిస్తోందని, మత ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉందని భావించి, 15 రోజుల పాటు సినిమా విడుదలపై స్టే విధించారు. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మరోసారి అభ్యంతరాలను పరిశీలించాలని ఆదేశించారు.

Advertisement

ఈ ఉత్తర్వులపై సినిమా నిర్మాతలు వెంటనే డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్, జస్టిస్ ఎస్.ఏ. ధర్మాధికారి మరియు జస్టిస్ పి.వి. బాలకృష్ణన్ కీలక తీర్పు వెల్లడించారు. సింగిల్ జడ్జి విధించిన స్టేను రద్దు చేస్తూ, సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

డివిజన్ బెంచ్ తన తీర్పులో స్పష్టంగా చెప్పింది. ఒకసారి CBFC సినిమా మొత్తాన్ని చూసి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత, ఆ నిర్ణయం పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే తీసుకున్నదని భావించాల్సి ఉంటుందని తెలిపింది. సినిమా విడుదలతో ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే, దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కోర్టు వ్యాఖ్యానించింది.

Advertisement

కేవలం టీజర్, ట్రైలర్ ఆధారంగా మాత్రమే సినిమా మొత్తం ప్రభావాన్ని అంచనా వేయలేమని కూడా కోర్టు అభిప్రాయపడింది. పూర్తి సినిమా చూడకుండా CBFC మార్గదర్శకాలను పాటించలేదని చెప్పడం సరైంది కాదని పేర్కొంది. అందుకే సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలవవని స్పష్టం చేసింది.

ఈ కేసులో పిటిషనర్లు సినిమా పేరు ‘కేరళ’ను ఉపయోగించడం ద్వారా రాష్ట్రాన్ని తప్పుగా చిత్రీకరిస్తోందని, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని వాదించారు. అయితే నిర్మాతల తరపు న్యాయవాదులు సినిమా బహు రాష్ట్రాల కథతో రూపొందిందని, స్పష్టమైన డిస్క్లెయిమర్ కూడా ఉందని కోర్టుకు వివరించారు.

చివరికి డివిజన్ బెంచ్ తీర్పుతో Kerala Story 2 విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో సినిమా అనుకున్న తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఏర్పడింది.

ALSO READ: Rukmini Vasanth: ఎర్ర చీరలో హాట్ డోస్ పెంచేసిన రుక్మిణి వసంత్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×