The Paradise: మార్చిలో రావాల్సిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) చిత్రాలు రెండూ వాయిదా పడిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా నుంచి రావాల్సిన సాంగ్స్ విషయంలోనూ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘చికిరి చికిరి’ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయగా, నాని ‘ది ప్యారడైజ్’ (The Paradise) మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ అంటూ ఊరిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రాబోతుందో మేకర్స్ ప్రకటించారు. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన పాన్ వరల్డ్ సినిమా ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ కాన్వాస్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఏ రేంజ్‌లో అంచనాలను పెంచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. ఇక తాజాగా వచ్చిన అప్డేట్ ఏమిటంటే..
Also Read- Mrunal thakur: దాని కోసం డైరెక్టర్ల వెంట పడక తప్పలేదు..ఊరికే స్టార్లు అయిపోరు: మృణాళ్
ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక వేడుకలకు టీమ్ సిద్ధమవుతోంది. అదే రోజున చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ను (First Single Aaya Sher) విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గూస్‌బంప్స్ తెప్పించే ఈ ఇంట్రడక్షన్ ట్రాక్‌తో సినిమా ప్రమోషన్స్‌కు గ్రాండ్‌గా ఆరంభం ఇవ్వబోతున్నారు మేకర్స్. ఈ పాటను వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. నాని ఫియర్స్, మాస్సీ అవతార్‌లో కనిపించే ఈ సాంగ్ కోసం రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పవర్‌ఫుల్ మాస్ ట్యూన్ అందించారని, సుధన్ మాస్టర్ రూపొందించిన డైనమిక్ కొరియోగ్రఫీ ఈ ట్రాక్‌ను విజువల్ స్పెక్టకిల్‌గా అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అభిమానులకు ఇది నాని ఇవ్వబోతున్న బర్త్‌డే ట్రీట్ అంటూ మేకర్స్ చెబుతున్న తీరు చూస్తుంటే.. ఈ సాంగ్ సెన్సేషన్‌ని క్రియేట్ చేయడం పక్కా అనేలా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
Also Read- Salman Khan: హాస్పిటల్లో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి.. అసలేమైందంటే?
ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే భారీగా క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత వస్తున్న ఒక్కో అప్డేట్.. మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. కెరీర్‌లో ఇప్పటి వరకు నాని చేయని, కనిపించని సరికొత్త అవతార్‌లో ఇందులో కనిపించబోతున్నారు. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన లుక్ కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాల్, స్పానిష్, ఇంగ్లీష్ భాషలలో ఆగస్ట్ 21న పాన్-వరల్డ్ సినిమాగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
The special day will be marked with MAYHEM 🔥🥁#AayaSher 🦁 from #TheParadise out on 24.2.26.
GRAND RELEASE WORLDWIDE ON AUGUST 21st, 2026 ❤🔥#JadalZamanaFromAug21
Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, Bengali, English, and Spanish.
Natural Star… pic.twitter.com/3PAVYtK3xC
— SLV Cinemas (@SLVCinemasOffl) February 17, 2026
Also Read- Sridevi: రాజమ్మగా శ్రీదేవి.. బ్యాండ్ మేళం నుంచి స్పెషల్ వీడియో రిలీజ్!