E-Paper
Advertisement

The Paradise: తెలంగాణ vs ఆంధ్ర సోషల్ మీడియా వార్..ఆయా షేర్ పాటతో రచ్చ.. !

The Paradise: తెలంగాణ vs ఆంధ్ర సోషల్ మీడియా వార్..ఆయా షేర్ పాటతో రచ్చ.. !
Advertisement

The Paradise: నాని పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ది ప్యారడైస్ సినిమాలోని తొలి పాట ఆయా షేర్‌ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. ఈ పాట రిలీజ్ అయిన వెంటనే నాని అభిమానుల్లో పండగ వాతావరణం కనిపించింది. ముఖ్యంగా ఈ పాటలో నాని కనిపించిన రఫ్ లుక్, పవర్‌ఫుల్ హుక్ స్టెప్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ పాటకు సంగీతం అందించింది ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. పాట సాహిత్యాన్ని తెలంగాణ యాసలో కాసర్ల శ్యామ్ రాశారు. తెలంగాణ మాండలికం..అక్కడి మాటల తీరును అచ్చుగుద్దినట్టు చూపించేలా ఈ పాట సాగింది. గాయకులు అడ్డుల జంగిరెడ్డి, అర్జున్ చాండీ తమ గొంతులతో పాటకు మరింత బలాన్ని ఇచ్చారు.

Advertisement

ఈ పాటలోని పదాలు, భావాలు తెలంగాణ ప్రజలకు చాలా దగ్గరగా అనిపిస్తున్నాయి. అందుకే తెలంగాణకు చెందిన చాలా మంది నెటిజన్లు ఈ పాటను తమ సంస్కృతి, తమ భాషకు వచ్చిన గౌరవంగా భావిస్తున్నారు. సాధారణంగా ప్రధాన తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసను ఈ స్థాయిలో చూపించరనే అభిప్రాయం ఉంది. అందువల్ల ‘ఆయా షేర్’ పాటను వారు గర్వంగా సెలబ్రేట్ చేస్తున్నారు.

అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఓ చర్చ కూడా మొదలైంది. కొంతమంది యూజర్లు, ప్రతి ఏడాది ఆంధ్ర యాసలో పాటలు వస్తాయని, కానీ వాటిని ఆంధ్ర ప్రేక్షకులు పెద్దగా తమ పాటలుగా చెప్పుకోరని వ్యాఖ్యానిస్తున్నారు. అలా ఉండగా, తెలంగాణ యాసలో పాట వస్తే మాత్రమే ఎందుకు ఇంత పెద్దగా స్పందన ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

దీనికి తెలంగాణ అభిమానులు సమాధానం కూడా ఇస్తున్నారు. గతంలో సినిమాల్లో తెలంగాణ యాసను ఎక్కువగా హాస్యానికి మాత్రమే వాడారని, నిజమైన ప్రతినిధ్యం చాలా తక్కువగా చూపించారని వారు అంటున్నారు. అందుకే ఇప్పుడు నిజమైన తెలంగాణ వాసన ఉన్న పాట వస్తే ఆనందం వ్యక్తం చేయడం సహజమే అని చెబుతున్నారు.

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది శ్రీకాంత్ ఓదెల. ఆయన గతంలో దసరా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ది ప్యారడైస్’ కథ 1960ల కాలం నేపథ్యంలో సాగే శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో నానిను పూర్తిగా కొత్తగా చూపించబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 21న తెలుగు సహా పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ఆయా షేర్’ పాటతోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయని చెప్పవచ్చు.

ALSO READ: Deepika Padukone: స్పిరిట్, కల్కి 2 తర్వాత మరో భారీ ఛాన్స్ మిస్ చేసుకున దీపికా పదుకొణె..!

Related News

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

Big Stories

Advertisement
×