E-Paper
Advertisement

MV Soundara Rajan: చిలుకూరు బాలాజీ ఆలయ వ్యవస్థాపకుడు సౌందర రాజన్ కన్నుమూత

MV Soundara Rajan: చిలుకూరు బాలాజీ ఆలయ వ్యవస్థాపకుడు సౌందర రాజన్ కన్నుమూత
Advertisement

MV Soundara Rajan: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, వీసా బాలాజీగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ ఎం.వి. సౌందర రాజన్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే చిలుకూరు ఆలయ పరిసరాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు.

సౌందర రాజన్ కేవలం ఆలయ వ్యవస్థాపకుడిగానే కాకుండా.. చిలుకూరు బాలాజీ క్షేత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన.. పదవీ విరమణ అనంతరం పూర్తి సమయాన్ని ఆధ్యాత్మిక సేవకే అంకితం చేశారు. ఆలయంలో హుండీ లేని వ్యవస్థను, వీఐపీ దర్శనాలు లేని సంప్రదాయాన్ని తీసుకురావడంలో ఆయన కృషి చిరస్మరణీయం. సామాన్య భక్తులకు.. ఉన్నత వర్గాలకు మధ్య వ్యత్యాసం ఉండకూడదని ఆయన ఎప్పుడూ ఆకాంక్షించేవారు.

Advertisement

ఆయన పర్యవేక్షణలోనే చిలుకూరు ఆలయం అత్యంత పవిత్రమైన.. నిరాడంబరమైన క్షేత్రంగా విరాజిల్లింది. భక్తులు 108 ప్రదక్షిణలు చేసే సంప్రదాయాన్ని ఆయన ఎంతో ప్రోత్సహించారు. సౌందర రాజన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు.. ఆధ్యాత్మిక గురువులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఆధ్యాత్మిక రంగానికి.. ముఖ్యంగా చిలుకూరు ఆలయ కుటుంబానికి తీరని లోటని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు కుటుంబ సభ్యుల సమక్షంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి.

Read Also: Vemulawada: పాపం.. కదిలిస్తే కన్నీళ్లే, వేములవాడలో యాచకులుగా మారిన ఎడ్యుకేటెడ్ కపుల్స్

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×