The Paradise Story:దసరా..శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వందకోట్ల పై చిలుకు వసూల్లని కొల్లగొట్టింది.దీంతో వీరి కాంబోలో ప్యారడైజ్ అనే సినిమా వస్తుందని అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా అంచనాలు స్కై లెవెల్ లోకి వెళ్ళిపోయాయి.
ఇక సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ అవుతుందని మేకర్స్ చెప్పినప్పటికీ సినిమా ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న వాలకం చూస్తుంటే సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవడం కష్టమనే టాక్ వినిపిస్తుంది.ఇక రిలీజ్ సంగతి ఇలా ఉంటె తాజాగా ఈ సినిమా కథ ఇదే అయి ఉంటుందా అంటూ ఒక క్రేజీ అనాలసిస్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతుంది.
‘దసరా’తో తెలంగాణ పల్లె వాతావరణాన్ని చాలా రా అండ్ రస్టిక్ గా చూపించిన శ్రీకాంత్ ఓదెల, ఈసారి 1980ల కాలం నాటి సికింద్రాబాద్ అండర్‌వరల్డ్ నేపథ్యాన్ని ఎంచుకున్న సంగతి తెల్సిందే.ఇక టీజర్ లో చూపించినట్టుగా నాని లుక్, ఆయన చేతిపై ఉన్న పచ్చబొట్టు, జడలు, చుట్టూ వయోలెన్స్ జరిగిన తీరు చూస్తుంటే శ్రీకాంత్ ఓడెల సినిమాని ఎంత డార్క్ మోడ్ లో తెరకెక్కించాడో అర్థం అవుతుంది.
ఇక సినిమాలో జడల్ అనే పాత్ర పోషిస్తున్న నాని సొసైటీ నుండి తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్న ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తాడని తెలుస్తుంది. తన తప్పేమీ లేకపోయినా కేవలం పుట్టుక ఆధారంగానే సమాజంలో అవమానాలు, ఈసడింపులు భరిస్తూ పెరుగుతాడని,ఇక కాల క్రమంలో ఆ అవమానాలే అతడిలో ఆవేశాన్ని రగిల్చి తిరుగుబాటుకు దారితీస్తాయని వినిపిస్తుంది.
ఇక ‘లంజకొడుకు’ అంటూ టీజర్‌లో వినిపించిన ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో తెల్సిందే.అయితే దీని వెనకాల ఒక పెద్ద కథనే శ్రీకాంత్ డిజైన్ చేసినట్టు తెలుస్తుంది.విలన్ శిఖంజా మాలిక్ గా కనిపిస్తున్న మోహన్ బాబు పాత్ర జడల్ ని తీవ్రంగా అవమానించడమే కాకుండా, అతడి చేతిపై బలవంతంగా ఆ పదాన్ని పచ్చబొట్టుగా వేయిస్తాడని సమాచారం.అలా లంజకొడుకు అనే పదాన్ని టాటూ గా వేయడంతో అవమానానికి గురయిన జడల్ దానినే తన శత్రువులపై చేసే పోరాటానికి, తిరుగుబాటుకు ఒక ఆయుధంగా మార్చుకుంటాడన్న టాక్ వినిపిస్తుంది.
ఇక జడల్ పోరాటం కేవలం శిఖంజా మాలిక్ అనే ఒక్క వ్యక్తిపైనే కాదని అతని వెనుక ఉన్న అక్రమ ఆయుధాల దందా, రాజకీయ పలుకుబడి, పెద్ద మాఫియా నెట్‌వర్క్ వంటి వాటిపైన ఉండబోతుందని సోషల్ మీడియా ఊదరగొట్టేస్తుంది.మొత్తంగా తనకి వ్యక్తిగతంగా ఎదురైన అవమానాన్ని కాస్తా సామూహిక పోరాటంగా జడల్ మార్చబోతాడని అర్థమయిపోతుంది.
ముఖ్యంగా విలన్ ఆ ఊరి ప్రజలందరి చేతులపైనా బానిసత్వాన్ని గుర్తుచేసే టాటూలు వేయించాలని చూసినప్పుడు, హీరో తన వర్గం అణచివేతని చూడలేకపెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తాడట.
ఇక చివరగా ఊరి ప్రజలను కాపాడటంతో పాటు విలన్ బంధీగా ఉన్న బిర్యాని (సంపూర్ణేష్ బాబు) కొడుకును ప్రాణాలకు తెగించి జడల్ కాపాడటం కథలో పెద్ద ఎమోషనల్ టచింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉందని వినిపిస్తుంది.
ఇక నాని లుక్‌లో కనిపిస్తున్న జడలు కేవలం విజువల్ మాస్ ఎలిమెంట్ కోసం మాత్రమే కాదట .తనపై పడిన అవమానపు ముద్రను తొలిగే వరకు వాటిని తీయననే హీరో తీసుకునే శపథానికి ఆ జడలు ఒక గుర్తుగా కనిపిస్తాయని తెలుస్తుంది.
ఇక ఈ కథకు ‘ది ప్యారడైజ్’ అనే పేరు ఊరికే పెట్టలేదట శ్రీకాంత్. రోజు నరకం లాంటి జీవితాన్ని అనుభవించే ప్రజలకు కడుపునిండా తిండి, ప్రశాంతమైన బతుకు, అవమానం లేని జీవితం దొరకడమే ఒక స్వర్గం. అందుకే ‘ప్యారడైజ్’ అంటే ఒక ప్రాంతం కాదు, అదొక ఆత్మగౌరవానికి సంకేతం అని అలా పెట్టాడట.
అయితే కథ ఇదని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే విభిన్న వాదనలు వినిపిస్తున్నారు నెటిజన్లు .కొంతమంది మరీ రా అండ్ రస్టిక్ లా ఉందని ఇలా అయితే ఆడియన్స్ కి ఎక్కుతుందా అని కొంతమంది అసలు కథ ఇదైతే మాత్రం అంతే సంగతులు అంటూ మరికొంతమంది పెదవి విరుస్తున్నారు.చూడాలి మరి వినిపిస్తున్న ఈ కథ తెరపై ఎలా కనిపిస్తుందో !