E-Paper
Advertisement

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం
Advertisement

ఇప్పటి వరకు మీరు చూసిన ప్రపంచం పటం వేరు. ఇకపై చూడబోయే ప్రపంచపటం వేరు. ఈసారి మొత్తం స్వరూపమే మారిపోనుంది. సరైన లెక్కలతో ఆశ్యరపరిచే విధంగా ఈ మ్యాప్ ఉండబోతుంది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ (UN General Assembly) ఇప్పటికే దీనికి ఆమోదం ఇచ్చేస్తూ తీర్మానం చేసేసింది. ఈ మ్యాప్‌లో ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఆఫ్రికా ఖండం మునుపటి కంటే చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాలు.. చిన్నవిగా కనిపిస్తున్నాయి.

తీర్మానానికి 164 దేశాల మద్దతు.. అమెరికా అలక

ఇన్నాళ్లూ ఈ ఖండాల సైజు అంతే కాబోలు అని ఫిక్సయిపోయాం. అయితే, ఈసారి ఖండాల వైశాల్యాన్ని మరింత ఖచ్చితత్వంతో రూపొందించారు. ఈ మార్పుకు ఇండియాతోపాటు 164 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. అమెరికా మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ప్రపంచ పటంలో తమ ఖండానికి సరైన గుర్తింపు దక్కాలంటూ ఆఫ్రికన్ యూనియన్ చేసిన డిమాండ్‌ ఆధారంగా టోగో దేశం ఐక్యరాజ్యసమితి ముందు ఈ ప్రతిపాదన ఉంచింది. ఫ్రాన్స్ వంటి ఇతర దేశాలు కూడా దీనికి మద్దతుగా ఇచ్చాయి. అంతేగాక, స్పాన్సర్లుగా కూడా నిలిచాయి.

ఈక్వల్ ఎర్త్ మ్యాప్ అంటే?

Advertisement

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు, వివిధ ప్రచురణలు, నావిగేషన్‌ వ్యవస్థలో వాడుతున్న మ్యాప్‌ను మెర్కేటర్ ప్రొజెక్షన్ (Mercator Projection) అని అంటారు. దీన్ని 1569లో గెరార్డస్ మెర్కేటర్ అనే కార్టోగ్రాఫర్ సముద్ర ప్రయాణంలో నావిగేషన్ కోసం దీన్ని రూపొందించారు. అప్పటి నుంచి దీన్నే ప్రామాణికంగా వాడుతున్నాం. టెక్నాలజీ ఇంత పెరిగినా.. ఇంకా పాత మ్యాప్‌నే ఉపయోగించడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. పైగా విస్తీర్ణంలో పెద్దదైన ఆఫ్రికాను చిన్న ఖండం చూపించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

పాత మ్యాప్‌లో లోపాలు కూడా కారణమే..

పాత మ్యాప్‌లో గోళాకార భూమిని టూ-డైమెన్షనల్‌ మ్యాప్‌లో చూపినప్పుడు.. ఉత్తర ప్రాంతాలు పెరిగి, భూమధ్యరేఖ ప్రాంతాలు కుచించుకుపోయాయి. దీనివల్ల మెర్కేటర్‌ పటంలో ఉత్తర అమెరికా, ఐరోపా పెద్దవిగా.. ఆఫ్రికా, లాటిన్ అమెరికా చిన్నవిగా కనిపించాయి. దీనికి పరిష్కారంగా.. కొందరు కార్టోగ్రాఫర్లు 2018లో ఈక్వల్‌ ఎర్త్‌ ప్రొజెక్షన్‌ కింద ప్రపంచపటాన్ని రూపొందించారు. దీన్నే UN ఆమోదించింది. ఈ పటంలో ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, దక్షిణాసియా ప్రాంతాలు పెద్దవిగా కనిపిస్తాయి. ఊదాహరణకు గ్రీన్ ల్యాండ్ వైశాల్యం ఆఫ్రికా కంటే పెద్దగా ఉంటుంది. కానీ, ఆఫ్రికా.. గ్రీన్ ల్యాండ్ కంటే 14 రెట్లు పెద్దది.

ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్‌ అంటే?

Advertisement

2018లో రూపొందించిన కొత్త పటాన్ని ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ (Equal Earth Projection) అని అంటారు. ఇది ఖండాల అసలైన వైశల్యాలను సమాన నిష్పత్తిలో ఖచ్చితత్వంతో చూపిస్తుంది. దీనివల్ల ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణ ఆసియాలు అసలైన వైశల్యానికి తగినట్లుగా పెద్దవి కనిపిస్తాయి.

అమెరికా అసంతృప్తి, ఎందుకంటే?

ప్రపంచ పటం మార్పును అమెరికా వ్యతిరేకించింది. దీనికి కారణం.. ఆఫ్రికా కంటే ఆ దేశం చిన్నగా కనిపించడమే. అయితే, ఆ విషయాన్ని నేరుగా చెప్పలేదు. ఐక్యరాజ్య సమితి విశ్వసనీయత కోల్పోవడానికి కారణం.. ఇలాంటి చర్యలేనంటూ అమెరికా ప్రతినిధి వ్యాఖ్యానించారు. నిజమైన ప్రపంచ సమస్యలను పట్టించుకోకుండా 16వ శతాబ్దం నాటి మ్యాప్‌ల గురించి చర్చించడం ఏమిటని మండి పడ్డారు.

Also Read: వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

అయితే, ఈ తీర్మానానికి మద్దతు పలికిన దేశాలు మాత్రం.. ఇకపై ఇదే తమ వరల్డ్ మ్యాప్ అని ప్రకటించాయి. తప్పుగా ఉన్న మ్యాప్‌ను సరిదిద్దడం సరైన చర్యేనని పేర్కొన్నాయి. మ్యాప్‌లు కేవలం భూగోళాన్ని చూపించడమే కాదని, అవి ప్రజల ఆలోచనా విధానాన్ని.. విద్యావ్యవస్థను ప్రభావితం చేస్తాయని స్పష్టం చేశాయి.

Tags

Related News

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

Big Stories

Advertisement
×