Andhra King Taluka : మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ కెరియర్ లో ఊహించదగ్గ హిట్ సినిమా రాలేదు అని చాలామందికి తెలిసిందే. మరోవైపు రామ్ అభిమానులు కూడా ఒక సక్సెస్ఫుల్ సినిమా చేస్తే బాగుంటుంది అని ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. మొత్తానికి మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా వాళ్ళ ఆశలను నెరవేర్చింది.
అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా విపరీతంగా నచ్చింది. పదిమంది సినిమా చూస్తే వాళ్లలో 9 మందికి సినిమా విపరీతంగా నచ్చింది. కానీ సినిమా చూసింది మాత్రం కేవలం పదిమంది అని ప్రెస్ మీట్ లో కూడా రామ్ పోతినేని చెప్పారు. అంటే ఈ సినిమా బాగుంది కానీ ఎక్కువమందికి రీచ్ అవ్వలేదు. కాబట్టే ఈ సినిమాను మళ్ళీ ప్రమోట్ చేస్తున్నాం అని అప్పుడు మాట్లాడారు రామ్.
ఇకపోతే ఆ సినిమా రిలీజ్ టైం లో రామ్ పోతినేని మరియు భాగ్యశ్రీ అమెరికా వెళ్లి సినిమాను ప్రమోట్ చేశారు. అయితే ఇక్కడ సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం వల్లనే సినిమాకి సరైన ఆదరణ లభించలేదు. మొత్తానికి ఆ సినిమాకి ఇప్పుడు మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయి అని అర్థమవుతుంది. రెండవ వారంలో కొన్నిచోట్ల ఆ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా అఖండ 2. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగా ప్రమోషన్స్ కూడా విపరీతంగా చేశారు. కాసేపట్లో ప్రీమియర్ షోలు మొదలవుతాయి అనుకున్న తరుణంలో ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆర్థిక లావాదేవీలు క్లియర్ కానీ కారణంగా సినిమాను పోస్ట్ పోన్ చేశారు.
ఇప్పటికీ కూడా అఖండ 2 సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ క్లారిటీ లేదు. మొత్తానికి అఖండ సినిమా పోస్ట్ పోన్ అవ్వటం ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి పనికొచ్చింది. ఎందుకంటే ఈ శుక్రవారం అసలు ఏ సినిమాలు కూడా విడుదల కాలేదు. మళ్లీ వచ్చే శుక్రవారం వరకు చూడాల్సిన సినిమాల్లో కేవలం ఆంధ్ర కింగ్ తాలూకు మాత్రమే ఉంది.
ఇది సినిమాకు ప్లస్ అయింది. మరోవైపు నవంబర్ నెలలో విడుదలయ్యే సినిమాలంటే తనకు సెంటిమెంట్ అని రామ్ గతంలో చెప్పాడు. ఇప్పుడు ప్రేక్షకులకు ఆప్షన్ లేదు కాబట్టి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి ఇలానే బ్రహ్మరథం పట్టి మంచి రీచ్ వచ్చింది అంటే ఖచ్చితంగా మెరుగైన కలెక్షన్లు కూడా చూడొచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. చిత్ర యూనిట్ భాగ్యశ్రీ మరియు రామ్ పోతినేని చాలామంది ప్రేక్షకులతో ఇంట్రాక్ట్ అవుతున్నారు.
Also Read: Suriya 47 : ఆ విలక్షణ దర్శకుడు తో సూర్య, హీరోయిన్ గా నజ్రియా