E-Paper
Advertisement

The Raja Saab: ది రాజా సాబ్ సినిమాతో అరుదైన రికార్డ్ సాధించిన ప్రభాస్.. దేశంలో అతనే తొలి హీరో!

The Raja Saab: ది రాజా సాబ్ సినిమాతో అరుదైన రికార్డ్ సాధించిన ప్రభాస్.. దేశంలో అతనే తొలి హీరో!
Advertisement

The Raja Saab: స్టార్ హీరో ప్రభాస్ పేరు వినగానే ఆయనకు పాన్ ఇండియా పరంగా ఉన్న అభిమానులు గుర్తొస్తారు. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ స్థాయి పూర్తిగా మారిపోయింది. తెలుగు సినిమా హీరోగా మొదలైన ఆయన.. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తాజాగా ఆయన నటించిన ది రాజా సాబ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సంక్రాంతి పండుగ సీజన్ లాంటి మంచి అవకాశం ఉన్నా కూడా సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

సినిమా విడుదలైన మొదటి రోజుల్లో ప్రభాస్ క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కానీ ఆ తర్వాత రోజు రోజుకీ కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి. దాదాపు పది రోజులు దాటాక మాత్రమే సినిమా 200 కోట్ల మార్క్‌ను దాటగలిగింది. ఈ సంఖ్య సినిమా ఫలితాన్ని మార్చలేకపోయినా..ప్రభాస్ ఖాతాలో మాత్రం ఓ కొత్త రికార్డు చేరింది.

Advertisement

ఇండియన్ బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ది రాజా సాబ్ ఇప్పటివరకు భారతదేశంలో సుమారు 142 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. గ్రాస్‌గా చూస్తే అది 167 కోట్లకు పైగా ఉంటుంది. ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమా దాదాపు 34 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మొత్తం కలిపి చూస్తే 13 రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

ఈ కలెక్షన్లతో ప్రభాస్ ఓ అరుదైన రికార్డు సృష్టించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఏడు సినిమాలు 200 కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లిన తొలి హీరోగా ఆయన నిలిచారు. ఈ జాబితాలో బాహుబలి, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సాలార్, కల్కి 2898 ఏడీ..ఇప్పుడు ది రాజా సాబ్ ఉన్నాయి. రాధే శ్యామ్ సినిమా 200 కోట్ల మార్క్‌కు దగ్గరగా వెళ్లి ఆగిపోవడం వల్ల ఆ రికార్డు మిస్ అయింది.

Advertisement

అయితే వసూళ్లు ఎంత వచ్చినా..ది రాజా సాబ్ సినిమాను మాత్రం టాలీవుడ్‌లో పెద్ద ఫ్లాప్‌లలో ఒకటిగా భావిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఇది రెండో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అయినా సరే, సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ బాక్సాఫీస్ పవర్ మాత్రం తగ్గలేదని ఈ కలెక్షన్లే స్పష్టంగా చెబుతున్నాయి.

ALSO READ: Sardar 2: కార్తీ బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌కు తప్పని బాధలు..!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×