E-Paper
Advertisement

Rajasthan Jail Marriage: జైల్లో ప్రేమించుకున్న ‘జీవితఖైదు’ జంట.. పెళ్లి కోసం పెరోల్, ఎక్కడంటే?

Rajasthan Jail Marriage: జైల్లో ప్రేమించుకున్న ‘జీవితఖైదు’ జంట.. పెళ్లి కోసం పెరోల్, ఎక్కడంటే?
Advertisement

Rajasthan Jail Marriage: ప్రేమ ఎక్కడ, ఎలా, ఎప్పుడు పుడుతుందో ఎవరూ ఊహించలేరు. మనసు కలిస్తే చాలు.. వయసు, మతం, వృత్తి మాత్రమే కాదు, వారు ఉన్న పరిస్థితులు కూడా అడ్డుకావని ఈ ఉదంతం నిరూపిస్తోంది. కఠినమైన జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు కిరాతక హంతకులు, జైలు గోడల మధ్యే ఒకరినొకరు ఇష్టపడ్డారు. నాలుగు గోడల మధ్య మొదలైన వీరి పరిచయం పెళ్లి పీటల వరకు వెళ్లడమే కాకుండా, వీరి వివాహం కోసం సాక్షాత్తూ హైకోర్టు 15 రోజుల పెరోల్ మంజూరు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

జైలులో చిగురించిన ప్రేమ

మోడల్ ప్రియా సేథ్, మరో ఖైదీ హనుమాన్ ప్రసాద్ జైలు గోడల మధ్య ఒకరినొకరు కలుసుకున్నారు. వీరిద్దరూ అల్వార్‌లోని సంగనేర్ ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సుమారు ఆరు నెలల క్రితం వీరి పరిచయం ప్రేమగా మారింది. తాజాగా వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, రాజస్థాన్ హైకోర్టు వీరికి 15 రోజుల అత్యవసర పెరోల్ మంజూరు చేసింది. నేడు (జనవరి 23, 2026) అల్వార్‌లోని బరోడమెవ్‌లో వీరి వివాహం జరగనుంది.

ప్రియా సేథ్ నేర చరిత్ర

Advertisement

ప్రియా సేథ్ ఒక కిరాతక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తోంది. 2018లో డేటింగ్ యాప్ (Tinder) ద్వారా పరిచయమైన దుష్యంత్ శర్మ అనే యువకుడిని ఆమె కిడ్నాప్ చేసింది. తన ప్రియుడు దీక్షాంత్ కమ్రా అప్పులు తీర్చడం కోసం రూ. 10 లక్షల తరాణాన్ని డిమాండ్ చేసింది. బాధితుడి తండ్రి రూ. 3 లక్షలు చెల్లించినప్పటికీ, బయటకు వెళ్తే తమ గుట్టు రట్టవుతుందనే భయంతో దుష్యంత్‌ను కత్తితో పొడిచి చంపేసింది. ఆపై శవాన్ని ముక్కలు చేసి సూట్‌కేసులో పడేసి ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తపడింది.

ఐదుగురిని చంపిన హనుమాన్ ప్రసాద్

పెళ్ళికొడుకు హనుమాన్ ప్రసాద్ కూడా తక్కువ వాడేమీ కాదు. 2017లో అల్వార్‌లో జరిగిన ఒక అత్యంత భయంకరమైన సామూహిక హత్య కేసులో ఇతను నిందితుడు. తన ప్రియురాలు సంతోష్ కోసం ఆమె భర్త బన్వారీ లాల్‌ను దారుణంగా హత్య చేశాడు. అయితే ఆ హత్యను చూసిన ప్రియురాలి ముగ్గురు పిల్లలను, ఒక మేనల్లుడిని కూడా ఆమె కోరిక మేరకే అతి కిరాతకంగా చంపేశాడు.

Advertisement

ఒకరు డేటింగ్ యాప్ హంతకురాలు, మరొకరు చిన్నపిల్లలని కూడా చూడకుండా ఐదుగురిని పొట్టనబెట్టుకున్న హంతకుడు. జైలు నిబంధనల ప్రకారం పెరోల్ సంపాదించి పెళ్లి పీటలు ఎక్కుతుండటం స్థానికంగా సంచలనం రేపుతోంది.

Read Also:  దారుణం.. తల్లిదండ్రులే ఆ పిల్లలకు శాపం..

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×