E-Paper
Advertisement

Peddi Movie: పెద్ది సినిమాని అంతమంది రిజెక్ట్ చేశారా?

Peddi Movie: పెద్ది సినిమాని అంతమంది రిజెక్ట్ చేశారా?
Advertisement

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆస్కార్ వేడుకలో దర్శనమిచ్చిన ఆయన రెడ్ కార్పెట్ పై కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ తాజాగా ఉప్పెన సినిమాతో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన “చికిరి చికిరి”, “రై రై రారా “పాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. నిజానికి మార్చ్ 27వ తేదీన రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ పలు కారణాలవల్ల ఏప్రిల్ 30కి ఈ సినిమాను వాయిదా వేశారు.

విడుదలకు సిద్ధమైన పెద్ది..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముందుగా బుచ్చి బాబు సనా తాను రాసుకున్న ఈ కథను మొదట కొంతమంది హీరోలకు వినిపించారట. వారు కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు సమాచారం.. ఆఖరికి ఈ సినిమా రామ్ చరణ్ చేతుల్లో పడింది ..మరి ఇప్పటివరకు ఈ సినిమా కథను బుచ్చి బాబు సన మొదట ఎవరికి వినిపించారు? ఎందుకు వారు ఈ కథను రిజెక్ట్ చేశారు? అనే విషయాలు ప్రస్తుతం నెట్టింట చర్చకు వచ్చాయి.

ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసిన కథతో రామ్ చరణ్..

Advertisement

బుచ్చి బాబు సన మొదట ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పారు.. అయితే ఆయన ఇందులో ఉన్న వేరియేషన్స్ బాగా నచ్చినప్పటికీ తన ఇతర సినిమాలకు కమిట్ అవడం వల్ల ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ కథను రిజెక్ట్ చేశారట.ఆ తర్వాత బుచ్చి బాబుసన ఇదే కథను అల్లు అర్జున్కి కూడా వినిపించారట. అల్లు అర్జున్ కూడా ఈ సినిమా నచ్చినప్పటికీ తాను బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాను చేయలేకపోయారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న నేపథ్యంలోనే పెద్ది సినిమా రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక తెలుగు హీరోలతో వర్క్ అవుట్ కాక .. బుచ్చి బాబు సన ఏకంగా తమిళ స్టార్ హీరో సూర్యకి కూడా ఈ కథ చెప్పారు. అయితే సూర్య ఇందులో కొన్ని మార్పులు చేర్పులు అడగడంతో బుచ్చిబాబు ఆయనను పక్కనపెట్టి సుకుమార్ సహాయంతో రామ్ చరణ్ దగ్గరికి ఈ కథను తీసుకెళ్లారు. ఇక రామ్ చరణ్ , చిరంజీవి ఇద్దరు ఈ కథను విని ఓకే చేయగా.. ఇప్పుడు ఈ సినిమా విడుదల సిద్ధమయ్యింది.

ALSO READ:Priyanka Chopra: ఆస్కార్ అవార్డు వేడుకలో మెరిసిన ప్రియాంక చోప్రా.. ధరించిన నెక్లెస్ ఎన్ని కోట్లో తెలుసా?

బుచ్చిబాబు వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా?

Advertisement

మొత్తానికైతే అలా ముగ్గురు హీరోల వద్దకు వెళ్ళిన ఈ కథ చివరికి రామ్ చరణ్ చెంతకు చేరింది. రామ్ చరణ్ ఈ సినిమాతో కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ ని అందుకుంటారని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పైగా రామ్ చరణ్ , సుకుమార్ ఇద్దరూ బుచ్చిబాబును బాగా నమ్మారు. మరి ఈ ఇద్దరి నమ్మకాన్ని బుచ్చిబాబు నిలబెట్టుకుంటారా లేదో చూడాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×