E-Paper
Advertisement

Priyanka Chopra: ఆస్కార్ అవార్డు వేడుకలో మెరిసిన ప్రియాంక చోప్రా.. ధరించిన నెక్లెస్ ఎన్ని కోట్లో తెలుసా?

Priyanka Chopra: ఆస్కార్ అవార్డు వేడుకలో మెరిసిన ప్రియాంక చోప్రా.. ధరించిన నెక్లెస్ ఎన్ని కోట్లో తెలుసా?
Advertisement

Priyanka Chopra:గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఈమె ఏం చేసినా సరే ఇట్టే పాపులర్ అవుతోంది అనడంలో సందేహం లేదు . దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియన్ సినిమాలో అవకాశం అందుకొని బిజీగా మారింది.ప్రస్తుతం రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో మహేష్ బాబు (Maheshbabu) హీరోగా నటిస్తున్న వారణాసి (varanasi) సినిమా ద్వారా ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించబోతోంది. ఇందులో మందాకిని అనే పవర్ఫుల్ పాత్ర పోషిస్తుంది ఈ ముద్దుగుమ్మ .రాజమౌళి సహకారంతో తెలుగు కూడా నేర్చుకుంటోంది.

రెడ్ కార్పెట్ పై మెరిసిన ప్రియాంక చోప్రా, నిక్ జోనస్..

ఇకపోతే గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె తాజాగా 98వ అకాడమీ ఆస్కార్ అవార్డు వేడుకల్లో తన భర్త నిక్ జోనస్ తో కలిసి దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది. రెడ్ కార్పెట్ పై నడిచి తమ హుందాతనంతో అందరిని మైమరిపించారు. ఇకపోతే ఈవెంట్ కి హాజరైన వారే కాదు ఈవెంట్ ని లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ , నిక్ జోనస్ చేతికున్న మంగళసూత్ర బ్రేస్లెట్ గురించే మాట్లాడుకుంటూ ఉండడం గమనార్హం. పైగా ప్రియాంక ధరించిన ఈ నెక్లెస్ అందరి దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా దీని ధర అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది కూడా.. మరి ప్రియాంక చోప్రా ధరించిన ఈ నెక్లెస్ ధర ఎంతో? దీనిని ఎవరు డిజైన్ చేశారో? ఇప్పుడు చూద్దాం.

Advertisement

ALSO READ:Tollywood Richest Hero’s: టాలీవుడ్ లో అత్యంత ధనవంతులైన హీరోలు వీళ్లే.. ఆయనను బీట్ చేసే వారే లేరా?

ప్రియాంక ధరించిన నెక్లెస్ ధర ఎంతంటే?

భారతీయ మూలాలను ప్రతిబింబిస్తూ నిక్ జోనస్ ధరించిన మంగళసూత్రం బ్రేస్లెట్ నెటిజన్ల మనసును సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం ప్రియాంక చోప్రా డయోర్ రూపొందించిన వైట్ కస్టమ్ గౌనులో మెరిసిపోయింది . క్లాసిక్ హాలీవుడ్ గ్లామర్ కి ఆధునిక స్పర్శ జోడిస్తూ ఈ అవుట్ ఫిట్ ను డిజైన్ చేశారు. ఇకపోతే ఈ స్ట్రాప్ లెస్ గౌను ఫిట్టెడ్ కార్సెట్ ప్రియాంక అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఇకపోతే ప్రియాంక ధరించిన దుస్తుల కంటే ఆమె ధరించిన నెక్లెస్ అందరిని ఆకట్టుకుంది.. బుల్గారి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈమె ది సర్పెంటి ఇల్యూసియో హై జ్యువెలరీ నెక్లెస్ ను ధరించింది. 14 క్యారెట్ల యాంటిక్ కుషన్ కట్ మడగాస్కర్ సఫైర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాము ఆకారంలో ఉండే ఈ నెక్లెస్ లో డైమండ్స్, ఎమరాల్డ్స్ తో పాటు ఒనిక్స్ ఎలిమెంట్స్ ను అద్భుతంగా పొందుపరిచారు. ప్రస్తుతం దీని ధర అక్షరాల కోటి రూపాయలు ఉంటుందని సమాచారం ..ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సైతం నోరెళ్ళ పెడుతున్నారు . ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

Related News

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

Big Stories

Advertisement
×