Anchor Pradeep : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. రేడియో జాకీగా తన కెరీర్ ని మొదలుపెట్టి, ఆ తర్వాత వీడియో జాకీగా ఎంట్రీ ఇచ్చాడు. తన క్రేజ్ తో ఎక్కడికి వెళ్లినా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వచ్చాడు. జీ తెలుగులో ప్రసారమైన గడసరి అత్త సొగసరి కోడలు షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ గా పరిచయం అయ్యాడు.. ఆ షో అతని క్రేజ్ ని పూర్తిగా పెంచేసింది.. ఆ తర్వాత పలు చానల్స్ లలో యాంకర్ గా వ్యవహరిస్తూ అలాగే సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం ఆయన హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా ప్రదీప్ పెళ్లి గురించి ఎప్పుడూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది.. తాజాగా ప్రదీప్ పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు… ఇంతకీ ప్రదీప్ ఇప్పట్లో పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి చేసుకునే అమ్మాయి ఇండస్ట్రీ అమ్మయా? కాదా? అసలు ప్రదీప్ కు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? ఏం చెప్పాడు ప్రదీప్ అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బుల్లితెర టాప్ యాంకర్లలో ఒకరు ప్రదీప్ మాచిరాజు.. తన ఆటిట్యూడ్ తో, చమత్కారంతో యువతని బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. తెలుగు టీవీ చానల్స్ లలో ప్రసారమైన కొన్ని షోలకు హోస్ట్గా వ్యవహరించారు ప్రదీప్. ఆయన చేసిన ప్రతి షో కూడా అతని ఇమేజ్ ని పెంచేసింది. తన కామెడీ టైమింగ్ తన మాటకారితనం జనాలను బాగా ఆకట్టుకోవడంతో సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి.. ఒకప్పుడు కేవలం సినిమాలలో కీలక పాత్రలో నటించేవాడు.. ఇప్పుడు హీరోగా కూడా పలు సినిమాలలో నటిస్తున్నాడు.. తాజాగా ఆయన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా ప్రదీప్ మాట్లాడుతూ తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.. అంతే కాదు ప్రదీప్ పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి కదా మరి పెళ్లెప్పుడు చేసుకుంటారు అని యాంకర్ అడుగుతారు.. మరి ఎలాంటి అమ్మాయిని చేసుకోబోతున్నారు ఇండస్ట్రీలో అమ్మాయిని చేసుకుంటారా అని యాంకర్ అడగ్గా.. దానికి ఓపిగ్గా సమాధానం చెప్పాడు ప్రదీప్.. ఇండస్ట్రీ అమ్మాయిని మాత్రం చేసుకోను మా అమ్మ ఎవరినైతే చూపిస్తుందో ఆ అమ్మాయిని చేసుకుంటాను.. మా బంధువులలో అమ్మాయిలని చూస్తున్నారు త్వరలోనే మీకు ఆ గుడ్ న్యూస్ చెప్తానని ప్రదీప్ చెప్పాడు.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో… పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ప్రదీప్ ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడు వెయిట్ చేద్దాం..
బుల్లితెర యాంకర్ హీరో ప్రదీప్ మాచిరాజు ప్రస్తుతం నటిస్తున్న మూవీ.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా` అనే చిత్రంతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ మూవీ ఫర్వాలేదనిపించుకుంది.. ఇది ఆ మూవీ వచ్చి దాదాపు నాలుగేళ్లు పూర్తయింది.. ఇన్నేళ్ల తర్వాత మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ మూవీలో యాంకర్ దీపిక పిల్లి హీరోయిన్గా నటిస్తుంది.. గత కొద్దిరోజులుగా సెట్స్ మీద ఉన్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక ఇంజనీర్ కుర్రాడి జీవితం ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా స్టోరీ అని ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టారు ప్రదీప్.. మొత్తానికి సినిమా టీజర్లు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ మూవీ అయినా ప్రదీప్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హీట్ ని అందుకునేలా చేస్తుందేమో చూడాలి..