E-Paper
Advertisement

Viral News: పరాకాష్టకు చేరిన వ్యూస్ పిచ్చి. భార్య ప్రసవ వేదనను లైవ్ పెట్టి, ఆ తర్వాత

Viral News: పరాకాష్టకు చేరిన వ్యూస్ పిచ్చి.  భార్య ప్రసవ వేదనను లైవ్ పెట్టి, ఆ తర్వాత
Advertisement

Viral News: భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టడమేకాదు.. జీవితాలను నాశనం చేస్తోంది సోషల్ మీడియా. కొంతమంది దీన్ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించే మార్గాలు మొదలు పెట్టారు. సరిగ్గా అలాగే చేశాడు చైనాకి చెందిన ఓ ఇన్‌ఫ్లుయెన్సర్లు. ఏకంగా తన భార్య ప్రసవ వేదనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు అతగాడు. ఇంతకీ అసలు ఏం జరిగింది.

విమర్శలకు గురైన చైనా ఇన్‌ఫ్లుయెన్సర్లు

Advertisement

స్మార్ట్ ఫోన్.. సోషల్‌ మీడియా ఉపయోగం వల్ల మంచి కాదు.. చెడు కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది.  అది తెలుసుకోక కొందరు చేయకూడని పనులు సైతం చేస్తున్నాయి. తాజాగా ఓ చైనా ఇన్‌ఫ్లుయెన్సర్ తన భార్య ప్రసవ వేదనను వీడియో తీశాడు. డెలివరీ సమయంలో ఆమె పడిన నరక యాతనను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి విమర్శల పాలయ్యాడు. అతగాడు చేసిన ఈ పనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికాలోని సియాటెల్‌లో నివాసం ఉంటున్నాడు అమెరికాలో పాల్ అని పిలివబడే చైనాకు చెందినవాడు జౌ జావో. అతడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. అతడికి డౌయిన్ ప్లాట్‌ఫామ్‌పై దాదాపు 12 మిలియన్ల మంది ఫాలో అవుతారు. అతడు ఏది చెప్పినా నమ్ముతారు. కళ్లకు కట్టినట్టు అలా చేసి చూపిస్తాడు.

Advertisement

సరిగ్గా తన భార్య విషయంలో అదే చేశారు. అతడి భార్య దాదాపు 23 గంటలపాటు పడిన ప్రసవ వేదనను అనుభవించింది.  వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. డెలివరీ అనగానే రకరకాల సమస్యలు గర్బణీలను వెంటాడుతుంటాయి. అయితే ఆమెకు ఆ సమయంలో తీవ్ర రక్తస్రావం అయ్యింది. చివరకు అత్యవసరంగా ఆపరేషన్ చేశారు డాక్టర్లు.

భార్యని ప్రసవ వేదనను లైవ్ పెట్టి, ఆపై యాడ్ చేశాడు

భార్య ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో జౌ తన కెమెరా ఆపలేదు. ఆ వీడియో మధ్యలో న్యాపీల కోసం పెయిడ్ యాడ్ స్క్రిప్ట్‌ను చదివి వినిపించాడంటే అతగాడికి వ్యూస్ పిచ్చి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. దేవుడి దయవల్ల జౌ భార్య-బేబీ ఆరోగ్యంగానే ఉన్నారు. దీనికి సంబంధించి వీడియోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

భార్య బిడ్డకు జన్మినిచ్చే సమయంలో బాధ పడుతుంటే కేవలం వ్యూస్ పెంచుకోవడం, డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావా? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహం చల్లారక పోవడంతో నిబంధనల ఉల్లంఘన కింద డౌయిన్, వీబో ప్లాట్‌ఫామ్స్ అతడి ఖాతాలను నిషేధించాయి. గోప్యత, వాణిజ్య సంబంధించిన ప్లాట్‌ఫారమ్ విధానాలను ఉల్లంఘించినందుకు పాల్ ఖాతాను బ్లాక్ చేశాయి.

ALSO READ:  ర్యాపిడో రైడ్ లో మహిళలకు నరకం, వీడియో వైరల్

ఈ వివాదం చైనాలో ఆన్‌లైన్ కంటెంట్ నైతిక విలువలపై తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. 1990లో జన్మించిన ఇన్ఫ్లుయెన్సర్ జౌ, కొలంబియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. ప్రస్తుతం సీటెల్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ విషయం తెలియగానే ఇన్ఫ్లుయెన్సర్ భార్య రియాక్ట్ అయ్యింది. ప్రసవంలో ఉండే రిస్క్‌లను తెలియజేయడానికే వీడియో తీశామంటూ వివరణ ఇచ్చింది.

ప్రసవ ప్రక్రియను అధికారికంగా నమోదు చేయడం మా ఉద్దేశ్యమని, చిత్రీకరణ సమయంలో ఆ తరహా సమస్యలు వస్తాయని తాము ఊహించలేదని పేర్కొంది. కేవలం ఫుటేజ్‌ని పంచుకోవడం ముఖ్యమని భావించినట్టు తెలిపింది. జింగ్టు ప్లాట్‌ఫామ్ నుండి వచ్చిన డేటా ప్రకారం.. చిన్న వీడియోలకు గణనీయమైన మొత్తాలను వసూలు చేస్తాడట. ఒకటి నుండి 20 సెకన్ల మధ్య క్లిప్‌లకు ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 33 లక్షలు ఛార్జ్ చేస్తాడు. అదే 21 నుండి 60 సెకన్ల మధ్య ఉండే వీడియోలకు దాదాపు రూ. 36 లక్షలు వసూలు చేస్తాడని సమాచారం. 60 సెకన్లకు మించిన వీడియోలకు రూ. 39 లక్షలు పైమాటేనట.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×