E-Paper
Advertisement

Prashanth Varma: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన మిస్టేక్ వల్లే స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడంలేదా..?

Prashanth Varma: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన మిస్టేక్ వల్లే స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడంలేదా..?
Advertisement

Prashanth Varma: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాదు ఇటీవల కాలంలో నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు ఒక సినిమాకి కథను కూడా అందించడంలో ఈయన ముందు ఉంటాడు. అయితే గత రెండేళ్లుగా ఈయన చుట్టూ ఏదో ఒక వివాదం తిరుగుతుంది. మొన్నటి వరకు స్టార్ హీరోలు ఈ డైరెక్టర్ కాంబోలో సినిమా చేయాలని ఆసక్తి కనబరిచే వారు.. కానీ ఈమధ్య ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు స్టార్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది.. అయితే ఈ డైరెక్టర్ చేసిన ఒక్కే ఒక చిన్న మిస్టేక్ వల్లే స్టార్ హీరోలు సినిమాలు చేయడం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకీ ఈ డైరెక్టర్ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ప్రశాంత్ వర్మ చేసిన పెద్ద మిస్టేక్…

ఒక సినిమాకి డైరెక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు.. ఆ మూవీ బరువు బాధ్యతలన్నీ కూడా ఆయన తన భుజాల మీద వేసుకోవాలి. సినిమా హిట్ అయితే మాత్రం మంచి క్రేజ్ అయితే వస్తుంది. ఒకవేళ ఏదైనా తేడా కొడితే ఆ డైరెక్టర్ పరిస్థితి దారుణంగా మారుతుంది. అందుకే ఒక సినిమా డైరెక్టర్ అన్ని ఆలోచించిన తర్వాతే హీరోలను సంప్రదిస్తాడు.. వేరే వాళ్ళకి కథ నచ్చితే డేట్స్ ఇస్తారు లేదంటే మాత్రం వేరే డైరెక్టర్ తో బిజీగా ఉన్నాము అంటూ ఏదొక సాకు చెప్తారు.. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పరిస్థితి అయోమయంగా మారింది.. గత కొద్దిరోజులుగా ఆయన గురించి వస్తున్న వార్తలకు స్టార్ హీరోలు అతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. కారణమేంటంటే గతంలో ఆయన బాలకృష్ణ కొడుకు అయిన మోక్షజ్ఞ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పి మధ్యలోనే వదిలేశాడు. దాంతో స్టార్ హీరోలు సైతం అతన్ని నమ్మడం లేదు.. దానివల్లే అతనితో చేయాలనుకున్న హీరోలు కూడా సైడ్ అయిపోయినట్లు సమాచారం..

Advertisement

Also Read :కన్నాను అవమానించిన లలిత.. మహాకు దిమ్మతిరిగే షాక్.. ప్రతాప్ డెడ్ లైన్..

ప్రశాంత్ వర్మ సినిమాల విషయానికొస్తే.. 

గతంలో ఈయన తెరకెక్కించిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టించింది. భారీగా వసూలను అందుకోవడంతో పాటుగా సినిమాకు మంచి క్రేజ్ కూడా లభించింది. దానికి సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ సినిమా మాత్రమే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో సక్సెస్ ని సాధించి స్టార్ హీరో తో సినిమా చేయాలనే ఆలోచనలో తాను ఉన్నట్టుగా తెలుస్తుంది.. బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో సినిమా గనుక చేసి ఉంటే అతని క్రేజీ పదింతలు పెరిగేదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మరి నెక్స్ట్ ఒక్క సినిమా హిట్ పడితే ఆ తర్వాత హీరోలు సినిమాలు చేయడానికి డేట్స్ ఇస్తారేమో చూడాలి..

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×