E-Paper
Advertisement

Podarillu Today Episode : కన్నాను అవమానించిన లలిత.. మహాకు దిమ్మతిరిగే షాక్.. ప్రతాప్ డెడ్ లైన్..

Podarillu Today Episode : కన్నాను అవమానించిన లలిత.. మహాకు దిమ్మతిరిగే షాక్..  ప్రతాప్ డెడ్ లైన్..
Advertisement

Podarillu Today Episode February 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. మహాలక్ష్మి ఉదయాన్నే పూజా చెయ్యడం చూసి అందరు షాక్ అవుతారు. శుక్రవారం కదా.. ఉదయం లేచి పూజ చేయడం అలవాటు అందుకే చేశాను అని అంటుంది. అయితే అప్పుడే అక్కడికి గాయత్రి వచ్చి మహాలక్ష్మికి తన గురించి చెప్తుంది.. ఇక ఇంట్లో ఏదో మంచి వాసన వస్తుంది అని వంట గదిలోకి వెళ్లి గాయత్రి మాధవ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరి గురించి తెలుసుకున్న మహా ప్రైవసీవ్వాలని అనుకుంటుంది..

ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళిద్దర్నీ ఒక గదిలో పెట్టి తాళం వేసిన సరే వాళ్ళిద్దరూ వంట గురించే మాట్లాడుకుంటారు. మీకు తెలియదు అనుకుంటా మాకు చిన్నప్పటినుంచి ఇలాంటివి అలవాటే అని చక్రి అంటాడు..మాధవ్ గాయత్రీ కి మహా గురించి చెప్తాడు.. అయ్యా నీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది నువ్వు ఇక్కడికి వచ్చి తీసుకోగలవా అని హారికను లలిత చెప్పమని చెప్తుంది.. హారిక చెప్పింది నిజమేనని నమ్మి మహాలక్ష్మి అక్కడికి వెళ్లడానికి ఒప్పుకుంటుంది.. కన్నా ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. కన్నా ని తీసుకొని మహాలక్ష్మి తన పుట్టింటికి వెళ్తుంది.. అయితే అక్కడ కన్నా ని లలిత దారుణంగా అవమానిస్తుంది. కానీ కన్న మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. లోపలికి వెళ్ళిన మహాలక్ష్మి అక్కడ ప్రతాప్ ఆది కూడా ఉండడంతో షాక్ అవుతుంది.. మహాలక్ష్మి తన తండ్రికి తన గురించి చెప్పాలని అనుకుంటుంది.. కానీ వాళ్లు మాత్రం అసలు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు.. నేను ఏ తప్పు చేయలేదు నాన్న ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను.. నాకు జాబ్ చేయాలని ఉంది. కానీ మీరు సడన్ గా పెళ్లి అనే లోపల నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే ఇంట్లోంచి వెళ్లిపోయాను అని మహాలక్ష్మి అంటుంది.

చక్రి మాత్రం మహాలక్ష్మి తిరిగి వస్తుందా లేదా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. కేశవ దగ్గరికి వెళ్లి టెన్షన్ పడిపోతూ ఉండగా కేశవా సెటర్లు వేయడంతో అక్కడి నుంచి వచ్చేస్తాడు.. ఇక మాధవ్ పనిచేసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్లిన చక్రి నేను చేస్తాను అని అంటాడు. అంతేకాదు ప్రతి పనికి అడ్డుగా వస్తాడు. ఏంట్రా నీ బాధ ఏంటి ఎందుకు నువ్వు నా పని నన్ను చేసుకుని ఇవ్వట్లేదు అని మాధవ్ అంటాడు.. ఇప్పుడు మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా మళ్లీ తిరిగి వస్తుందా లేదా అని నాకు టెన్షన్ గా ఉంది అన్నయ్య అని చక్రి బాధపడిపోతూ ఉంటాడు.

Advertisement

ఆ అమ్మాయి నా జీవితంలో ఉంటే కచ్చితంగా నా జీవితం మలుపు తిరుగుతుందని నేను అనుకున్నాను . మహాలక్ష్మి నా నుంచి దూరంగా వెళ్లి పోతుందేమో అని భయంగా ఉంది అన్నయ్య అని చక్రి టెన్షన్ పడిపోతుంటాడు.. అది చూసిన మాధవ నువ్వేమి టెన్షన్ పడకు రా ఆ అమ్మాయి కచ్చితంగా తిరిగి వస్తుంది.. వెళ్లాలి అని అనుకునేదైతే ఎప్పుడో వెళ్లిపోయేది. ఆ అమ్మాయి మీద నాకు నమ్మకం ఉంది.. మళ్లీ తిరిగి ఇక్కడికి వస్తుంది. దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది. దాంట్లో ఎటువంటి మార్పు లేదు అంటూ మాధవ్ అనడంతో చక్రి షాక్ అవుతాడు. ఇప్పుడిప్పుడే మన ఇంటికి మహాలక్ష్మి బాగా దగ్గరవుతుంది ఈ టైం లో వాళ్లు రమ్మని పిలిచారు అంటే కచ్చితంగా తనని మార్చేసి అక్కడే ఉంచేలా ప్లాన్ చేస్తున్నారేమో అని చక్రి అనుకుంటాడు..

Also Read:మీనాపై ప్రభావతి సీరియస్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. మనోజ్ రివర్స్..

సర్టిఫికెట్లు ఇస్తామని ఇంటికి రమ్మన్నారు అంటే.. కచ్చితంగా ఏదో జరుగుతుందని నాకు భయంగా ఉంది అన్నయ్య అని మాధవ్ తో చక్రి అంటాడు. తోడుగా కన్న వెళ్లాడు కదా నువ్వేమీ భయపడకు కచ్చితంగా ఏదైనా జరిగితే కన్నా ఫోన్ చేసి చెప్తాడు కదా అని మాధవ్ అంటాడు.. ఇక మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే ప్రతాప్ మాత్రం నువ్వేం చెప్పినా నేను వినను నువ్వు నన్ను మోసం చేశావు అని అంటాడు.. మమ్మల్ని ఏడిపించి నువ్వు ఆ పెళ్లి చేసుకున్నావ్. ఇప్పుడేం సుఖపడుతున్నావ్..? ఆ ఇంటి గురించి నాకు చెప్పినప్పటి నుంచి నాకు కాళ్లు చేతులు ఆడడం లేదు అని లలిత అంటుంది. నువ్వు ఇకమీదట అక్కడికి వెళ్లడానికి వీల్లేదు ఇక్కడే ఉండాలి అని లలిత కండిషన్ పెడుతుంది. ఆ మాట విన్న మహాలక్ష్మి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×