E-Paper
Advertisement

Vanajeevi Ramaiah: వనజీవి రామయ్యగా బ్రహ్మాజీ.. బయోపిక్ లుక్ అదుర్స్..!

Vanajeevi Ramaiah: వనజీవి రామయ్యగా బ్రహ్మాజీ.. బయోపిక్ లుక్ అదుర్స్..!
Advertisement

Vanajeevi Ramaiah: సంక్రాంతి పండుగలో భాగంగా వచ్చే కనుమ రోజున.. టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఒక.. ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోతో పాటు ఆయన “Need your blessings” అంటూ అభిమానులను ఆశీర్వాదాలు కోరడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 

Advertisement

ఈ ఫోటో వనజీవి రామయ్య బయోపిక్‌కు సంబంధించినది కావడం విశేషం. ప్రకృతి ప్రేమికుడిగా, పర్యావరణ పరిరక్షకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్న ప్రయత్నంలో.. ఆయన గెటప్ వేసుకొని బ్రహ్మాజీ.. ఆ లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కనుమ విషెస్ చెప్పారు.

 

Advertisement

ఈ చిత్రంలో వనజీవి రామయ్య పాత్రను బ్రహ్మాజీ పోషిస్తున్నారు. బ్రహ్మాజీ షేర్ చేసిన ఫోటోలో చెట్టును ఆప్యాయంగా హత్తుకుంటూ, తలపై “వృక్షో రక్షతి రక్షితః” క్యాప్ పెట్టుకుని.. అచ్చం వలజీవి రామయ్య లానే కనిపించారు. ఇది వనజీవి రామయ్య జీవన విధానాన్ని గుర్తు చేసేలా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. “వృక్షో రక్షతి రక్షితః” అనే భావనను తన జీవితాంతం పాటించిన రామయ్య గారి వ్యక్తిత్వం ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

 

పద్మశ్రీ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన వనజీవి రామయ్యను ప్రజలు ప్రేమగా “కోటి మొక్కల రామయ్య” అని పిలుస్తారు. ఆయన ఊరూరా తిరుగుతూ చెట్ల ప్రాధాన్యతను వివరించడమే కాకుండా..శుభకార్యాలకు వెళ్లినప్పుడు బహుమతులుగా మొక్కలను ఇవ్వడం ఆయన ప్రత్యేకత. తన చివరి శ్వాస వరకు ప్రకృతి కోసం తపించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు.

 

కోటి మొక్కల రామయ్య బయోపిక్..

 

ఈ బయోపిక్‌కు నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతగా లింగంపల్లి చంద్రశేఖర్ వ్యవహరిస్తుండగా, సంగీతాన్ని బల్లేపల్లి మోహన్ అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని బల్లేపల్లిలో షూటింగ్ ప్రారంభమైందని ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. వనజీవి రామయ్య జీవితాన్ని రాబోయే తరాలకు స్పూర్తిగా చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వారు తెలిపారు.

 

పండగ సంబరాలలో వనజీవి బ్రహ్మాజీ..

 

కనుమ వంటి పండుగ రోజున బ్రహ్మాజీ ఈ ఫోటోను షేర్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇది కేవలం సినిమా అప్డేట్ మాత్రమే కాకుండా..ప్రకృతి పరిరక్షణపై మరోసారి చర్చ మొదలయ్యేలా చేసింది. వనజీవి రామయ్య జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సందేశాత్మకంగా ఉండబోతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి…

 

Also Read:

Related News

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

Big Stories

Advertisement
×