E-Paper
Advertisement

రెండేళ్లుగా అన్నం తినటం మానేసిన నటుడు.. ఆ సమస్యలే కారణమా?

రెండేళ్లుగా అన్నం తినటం మానేసిన నటుడు.. ఆ సమస్యలే కారణమా?
Advertisement

Babu Mohan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు బాబు మోహన్ ఒకరు. ఈయన దాదాపు 5 దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన విభిన్నమైనటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ అంటే బాబు మోహన్ పేరు గుర్తుకు వచ్చేది. అప్పట్లో స్టార్ హీరోలందరి సినిమాలలో ఈయన కమెడియన్ గా నటించి మెప్పించారు. ఇటీవల కాలంలో బాబు మోహన్ పూర్తిగా సినిమాలను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.

ఆరోగ్యంపై దృష్టి పెట్టిన బాబు మోహన్..

ఈయన వయసు పై పడటంతో సినిమాలకు కాస్త దూరమయ్యారు అదేవిధంగా రాజకీయాలలో కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఏడుపదులు వయసులో ఉన్నటువంటి బాబు మోహన్ ఎంతో చురుకుగా చలాకీగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈయన ఇంత చురుగ్గా ఉండడానికి కారణం లేకపోలేదని చెప్పాలి. చిన్నప్పటినుంచి కూడా ఎంతో మంచి పోషిక విలువలు కలిగిన ఆహార పదార్థాలను మాత్రమే తాను తీసుకున్నానని ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బాబు మోహన్ తెలియజేశారు.

Advertisement

రెండేళ్లుగా నో రైస్..

తన తండ్రి టీచర్ కావడంతో మా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు వహించేవారని మేం తీసుకునే ప్రతి ఆహారం పోషక విలువలతో కూడుకున్నది ఉండాలని తన తండ్రి కఠిన నిర్ణయం పెట్టే వారిని తెలిపారు. ఇలా పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు..73 ఏళ్ల వయసులో తన ఆరోగ్యం మరింత దృష్టి సారించిన బాబు మోహన్ గత రెండు సంవత్సరాలుగా అన్నం తినకుండా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిగా అన్నం పక్కన పెట్టిన బాబు మోహన్ కేవలం పండ్లు, పండ్ల రసాలు, రాగిజావ లాంటి వాటిని మాత్రమే తీసుకుంటున్నానని తెలిపారు.

Advertisement

ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు..

ఒకప్పుడు తనకు ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు అంతా ఇష్టంగా మాంసాహారం తినేవాడిని కానీ ఇటీవల కాలంలో పూర్తిగా మాంసాహారం పక్కన పెట్టేసానని తెలిపారు. తాను ఏదైనా ఒకసారి వద్దు అనుకుంటే మరోసారి దాని వంక తిరిగి చూడనని బాబు మోహన్ తెలియజేశారు. ఇలా ఆరోగ్య సమస్యల కారణంగా ఈయన అన్నం పక్కన పెట్టలేదు కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే రైస్ పూర్తిగా పక్కనపెట్టి పండ్లు పండ్ల రసాలు వంటి ద్రవపదార్థాలను తీసుకుంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇలా ఏడుపదుల వయసులో కూడా బాబు మోహన్ ఆరోగ్య విషయంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ చూసి ఎంతో మంది ఫిదా అవుతున్నారు. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు అయితే రాజకీయాల పరంగా ఇప్పటికే ఎన్నో పార్టీలు మారిన బాబు మోహన్ ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.

Also Read: ధురంధర్ నటుడికి కోటి రూపాయల బోనస్… క్లారిటీ ఇచ్చిన రాకేష్ బేడి!

Related News

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

Big Stories

Advertisement
×