E-Paper
Advertisement

ధురంధర్ నటుడికి కోటి రూపాయల బోనస్… క్లారిటీ ఇచ్చిన రాకేష్ బేడి!

ధురంధర్ నటుడికి కోటి రూపాయల బోనస్… క్లారిటీ ఇచ్చిన రాకేష్ బేడి!
Advertisement

Rakesh Bedi: రాకేష్ బేడి ఇటీవల ధురంధర్ (Dhurandhar)సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో ఈయన జమిల్ జమాలి అనే పాత్రలో నటించారు. ఇక ఈ పాత్ర తనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ఈ సినిమాలో ఈయన పాత్ర మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఈ సినిమా కూడా వందల కోట్ల కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టించిన నేపథ్యంలో ధురంధర్ చిత్ర నిర్మాతలు ఏకంగా కోటి రూపాయలు బోనస్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా రాకేష్ బేడీ(Rakesh Bedi) నిజంగానే కోటి రూపాయలు అందుకున్నారా అంటూ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

డబ్బు ఎక్కడుందో చెప్తే వెళ్లి తెచ్చుకుంటా..

ఇలా ధురంధర్ సినిమా ద్వారా కోటి రూపాయలు బోనస్ అందుకున్నారు అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై తాజాగా రాకేష్ బేడీ స్పందించారు. ఈ వార్తలపై స్పందించిన ఈయన… ‘నాకు ఆ డబ్బు ఇచ్చి ఉంటే ఎక్కడుందో చెప్తే వెళ్లి తెచ్చుకుంటా. నా ఖాతాలో మాత్రం జమ కాలేదు’ అంటూ ఫన్నీగా స్పందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన కొంతసేపటికి రాకేష్ బేడి ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది.’జమిల్ జమాలి’ పాత్ర ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారింది. ఆయన ఇండియన్ స్పై ఏజెంట్ అని పార్ట్‌-2లో రివీల్ చేయడమే ఇందుకు కారణమని చెప్పాలి.

కోటి రూపాయల బోనస్ పై రాకేష్ బేడీ క్లారిటీ..

Advertisement

రాకేష్ బేడీ తనకు కోటి రూపాయలు ఇచ్చారు అంటూ వస్తున్నటువంటి వార్తలపై ఫన్నీగా స్పందిస్తూ ఒక వీడియోని షేర్ చేశారు. దీంతో ఈ వార్తలలో నిజం లేదని స్పష్టమైనది కానీ ఈయన వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయడంతో అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన ఈ వీడియో డిలీట్ చేసే సమయానికి అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి భాగం విడుదలైన కొద్ది రోజుల వ్యవధిలోనే రెండో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రణవీర్ సింగ్, సారా అర్జున్..

Advertisement

ఈ రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఉగాది పండుగను పురస్కరించుకొని విడుదలైన ధురంధర్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 1700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. సరైన సక్సెస్ లేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడుతున్న బాలీవుడ్ సినిమాలకు ధురంధర్ ఊపిరి పోసిందని చెప్పాలి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్(Ranveer Singh), సారా అర్జున్(Sara Arjun) ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం వీరిద్దరూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.

Also Read: ఆ సినిమా కోసం కొత్త ప్రయోగం చేసిన యామీ గౌతమ్ .. డెడికేషన్ కి ఫిదా అవ్వాల్సిందే!

Related News

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

Big Stories

Advertisement
×