Devi Priya controversy: టాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ వేదుల సూర్యనారాయణ మూర్తి (అలియాస్ దేవి ప్రియ) సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపొయింది. జర్నలిజం అనే పవిత్రమైన వృత్తిని అడ్డం పెట్టుకుని, సినిమా సెలెబ్రిటీల పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాడంటూ ఈ ‘కలం’ వీరుడి’పై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) మూడు నెలల సస్పెన్షన్ వేటు వేసింది.అయితే తిరిగి మళ్ళీ అసోసియేషన్ లో చేరడంతో ఈసారి అతన్ని ఏకంగా అసోసియేషన్ నుండే బ్యాన్ చేయాలని అందుకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తాజాగా దర్శకుల సంఘం రిలీజ్ చేసిన లెటర్ టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
also read:దురంధర్ 2 మాయలో పడి చేతులు కాల్చుకుంటావా జక్కన్నా ?
పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా చర్యలు
ప్రస్తుతం ఇండిపెండెంట్ జర్నలిస్టుగా కొనసాగుతున్న మూర్తి గతంలో లక్ష్మి ప్రసన్న ఇంటర్వ్యూలో అనుచితమైన క్వశ్చన్స్ వేసి అసోసియేషన్ తో మొట్టికాయలు తిన్నారు కూడా.ఇక అలాంటి ప్రవర్తన కారణంగానే ఆరు నెలల సస్పెన్షన్‌కు గురైన మూర్తి, అప్పట్లో క్షమాపణలు చెప్పి తిరిగి సంఘంలో చేరిన సంగతి తెలిసిందే.అయితే అప్పటి నుంచి తనను వ్యతిరేకించిన వారిపై మరింత కక్షతో వ్యవహరిస్తూ, వారి వ్యక్తిగత జీవితాలను సైతం బజారున పడేసేలా రాతలు రాస్తున్నారని దర్శకుల సంఘం తీవ్రంగా ఆరోపిస్తోంది. ముఖ్యంగా అతను సినిమా పై చేసే విమర్శలు స్థాయి దాటి,పర్సనల్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా ఉంటున్నాయని, అతని ప్రవర్తన జర్నలిజం వృత్తికే మచ్చ తెచ్చేలా ఉందనిఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అసోసియేషన్ కార్యక్రమాలను తప్పుబట్టడం, వ్యవస్థను పొల్యూట్ చేయడం వంటి చర్యలను డైరెక్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.
శాశ్వత బహిష్కరణే సరైన మార్గమని డిమాండ్
డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వి.ఎన్. ఆదిత్య, పి.వి. రామారావు సాయి రాజేష్ సంయుక్తంగా రాసిన లేఖలో మూర్తి వల్ల ఎంతోమంది దర్శకులు మానసిక క్షోభకు గురయ్యారని, కాబట్టి కేవలం మూడు నెలల సస్పెన్షన్ అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, పరిశ్రమ గౌరవాన్ని కాపాడాలంటే మాత్రం శాశ్వత బహిష్కరణే సరైన మార్గమని వారు డిమాండ్ చేశారు. జనరల్ గా జర్నలిస్టులతో ఎంతో ప్రెండ్లీగా ఉండే ఇండస్ట్రీ ఈసారి మూర్తి విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించడం చూస్తుంటే ఇష్యూ ఎంత సీరియస్ గా ఉందో అర్థం అవుతుంది . ఇక ప్రస్తుతానికి ఈ సస్పెన్షన్ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారగా, దీనిపై నెక్స్ట్ ఎలాంటి యాక్షన్స్ ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
అయితే వ్యక్తులుగా కాకుండా వ్యవస్థగా నడిచే తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ లెటర్ ఆధారంగా పర్మినెంట్ గా బ్యాన్ చేసినా ఆశ్చర్యం లేదు. చూస్తుంటే మూర్తి గారి జర్నలిజం కెరీర్ కి ఎండ్ కార్డ్ పడ్డట్టే కనిపిస్తుంది. చూడాలి మరి ఈ ఇష్యూలో TFJA ఏం నిర్ణయం తీసుకుంటుందో !
also read:Dhurandhar Controversy: 1100 కోట్లు కొట్టారు సరే.. మా వాటా ఎక్కడ? అంటుంది ఎవరో తెలుసా ?వీడియో వైరల్