E-Paper
Advertisement

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల ఫలితాలు విడుదల!

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల ఫలితాలు విడుదల!
Advertisement

Tollywood: సినిమా అంటే వెండితెరపై మనకు హీరో హీరోయిన్లతో పాటు విలన్స్ మాత్రమే కనిపిస్తూ ప్రేక్షకులకు రెండున్నర గంట పాటు మంచి వినోదాన్ని అందిస్తారు. అయితే సినిమా అంటే వీళ్ళు మాత్రమే కాదు తెర వెనుక ఎంతో మంది కష్టపడితేనే తెరపై మనం ఈ వినోదాన్ని చూడగలుగుతున్నాము. ఇండస్ట్రీలో మొత్తం 24 విభాగాలు ఉంటాయి. ఈ 24 విభాగాలకు చెందిన కార్మికుల సంక్షేమం గురించి వారి యోగక్షేమాలను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చూసుకుంటుందని సంగతి తెలిసిందే.

ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికలు..

ఇలా కార్మికుల యోగక్షేమాలను చక్కబెట్టడం కోసం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ లో కూడా అధ్యక్షుడు ప్రధాన అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వడం కోసం ఎన్నికలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికలు జరిగాయి. నేడు ఉదయం ఈ ఎన్నికలు జరగగా తాజాగా ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఎన్నికలలో భాగంగా పెద్ద ఎత్తున అభ్యర్థులు నువ్వా నేనా అంటూ పోటీకి దిగారు. మొత్తం 72 ఓట్లు ఉండగా వీటిలో 69 ఓట్లు పోల్ అయినవి. మరి ఎన్నికల ఫలితాలలో ఎవరు విజయం సాధించారు? ఎంత మెజారిటీతో విజయం అందుకున్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ బాధ్యతలు ఎవరు తీసుకున్నారు అనే విషయానికి వస్తే..

అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ విజయం..

Advertisement

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికలలో భాగంగా అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీ చేశారు ఇందులో భాగంగా వల్లభనేని అనిల్ కుమార్ 30 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అధ్యక్షుడి పదవి సొంతం చేసుకున్నారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవికి ఏకంగా ముగ్గురు వ్యక్తులు పోటీలోకి దిగారు. ప్రధాన కార్యదర్శిగా లంక రాజేంద్రప్రసాద్ 14 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక చివరిగా కోశాధికారి పదవి కోసం ఇద్దరు పోటీకి దిగారు. ఈ పదవిలో భాగంగా వెల్లంకి శ్రీనివాస్ విజయం సాధించారు అయితే 4 ఓట్ల మెజారిటీతో శ్రీనివాస్ కోశాధికారిగా ఎంపిక అయ్యారు.

ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు..

Advertisement

ఇలా ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ ఎన్నికలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. 2024 లో జరిగిన ఎన్నికలలో భాగంగా అమ్మిరాజు కానుమల్లి విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికలలో భాగంగా తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన 24 క్రాఫ్టుల కార్మికులు సభ్యులుగా ఉంటారు. ఇక నేడు ఈ ఎన్నికలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగాయి. ఫలితాలు వెల్లడి కావడంతో ఈ ఎన్నికల ఫలితాలలో వల్లభనేని అనిల్ కుమార్ అధ్యక్షుడిగా విజయం సాధించారు.

Also Read: నెపోటిజం పై అర్జున్ కళ్యాణ్ కామెంట్స్.. రెకమండేషన్స్ ఉంటేనే ఛాన్సులు?

Related News

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×