E-Paper
Advertisement

యాపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్.. iPhone 18 Pro కెమెరా చూస్తే షాక్ అవ్వాల్సిందే, ఫొటోలు లీక్!

యాపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్.. iPhone 18 Pro కెమెరా చూస్తే షాక్ అవ్వాల్సిందే, ఫొటోలు లీక్!
Advertisement

Apple Leaks: యాపిల్ నుంచి కొత్త ఐఫోన్ వస్తుందంటే చాలు.. టెక్ ప్రియుల్లో అంచనాలు మామూలుగా ఉండవు. ఇప్పుడు iPhone 18 సిరీస్‌కు సంబంధించి వస్తున్న లీకులు కూడా నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈసారి Pro మోడల్స్ కెమెరా డిజైన్‌లో కీలక మార్పులు ఉండబోతున్నాయని, అలాగే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ Ultra కూడా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ మాక్స్ టెక్ యూట్యూబ్ ఛానెల్ బయటపెట్టిన వివరాల ప్రకారం iPhone 18 ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.

కెమెరా కోసం కాస్త మందంగా..

iPhone 18 Pro మోడల్స్ చూడటానికి మన పాత ఐఫోన్ల లాగే ఉన్నా.. వెనుక వైపు కెమెరా సెటప్‌ను గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఈసారి కెమెరా మాడ్యూల్ గతంలో కంటే కొంచెం ఎత్తుగా, మందంగా ఉండబోతోంది. శాంసంగ్ వంటి ఇతర కంపెనీలు కెమెరాను వీలైనంత ఫ్లాట్‌గా చేసే ప్రయత్నం చేస్తుంటే.. యాపిల్ మాత్రం కెమెరా క్వాలిటీ కోసం ఆ బంప్‌ను పెంచడానికే మొగ్గు చూపుతోంది. దీంతో ఈసారి ఫొటోలు, వీడియోలు నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతున్నాయన్నమాట.

Advertisement

Also Read: Redmi Note 17 Pro Max.. 200MP కెమెరా, 10,000mAh బ్యాటరీ, ఈ రేంజ్ ఫీచర్లను ఎప్పుడైనా చూశారా?

ఆ తేడా పెద్దగా తెలియకపోవచ్చు..

ఫోన్ మొత్తం సైజులో పెద్దగా మార్పులేమీ లేవు కానీ, iPhone 18 Pro Max ఎత్తు, వెడల్పులో చాలా స్వల్పంగా (మిల్లీమీటర్లలో) మార్పులు ఉండవచ్చు. దాదాపు 0.36 మిమీ ఎత్తు, 0.39 మిమీ వెడల్పు పెరిగే ఛాన్స్ ఉందని లీకులు చెబుతున్నాయి. ఇది కంటికి పెద్దగా కనిపించకపోయినా.. ఫోన్ పట్టుకున్నప్పుడు చేతికి ఇచ్చే గ్రిప్ విషయంలో యూజర్లకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు.

iPhone Ultraలో కీలక మార్పులు..

Advertisement

అన్నింటికంటే ఎక్కువగా ఫోల్డబుల్ Ultra మోడల్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. యాపిల్ నుంచి వస్తున్న తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మోడల్‌లో కేవలం రెండు కెమెరాలు మాత్రమే ఉండటం, కనీసం మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా కనిపించకపోవడం టెక్ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. బహుశా ఇది ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న డిజైన్ కావచ్చు. కాబట్టి ఫైనల్ వెర్షన్ వచ్చేసరికి మరిన్ని మార్పులు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఫొటోగ్రఫీకి బెస్ట్ ఆప్షన్..

మీరు గనుక ఇప్పటికే iPhone 16 లేదంటే 17 వాడుతుంటే.. ఈ చిన్న మార్పుల కోసం అప్‌గ్రేడ్ అవ్వాలా అని ఆలోచించవచ్చు. కానీ ఐఫోన్‌తో ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ చేసేవారికి, అలాగే పాత మోడల్స్ వాడుతున్న వారికి iPhone 18 Pro బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇక ఫోల్డబుల్ ఫోన్ అంటే ఇష్టపడే వారికి Ultra మోడల్ సరికొత్త లోకాన్ని పరిచయం చేయనుంది. మొత్తానికి యాపిల్ ఈసారి కెమెరా ప్రియులను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Also Read: బడ్జెట్ ధరలో ఇలాంటి ఫీచర్లా? 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో రెడ్‌మీ సరికొత్త రికార్డ్!

Related News

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

Big Stories

Advertisement
×