E-Paper
Advertisement

Vijay Devarakonda : సీఏం రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ.. పెళ్లి ఆహ్వానమేనా..?

Vijay Devarakonda : సీఏం రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ.. పెళ్లి ఆహ్వానమేనా..?
Advertisement

Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ భేటీ వెనక ఏదో కారణం ఉంటుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సినిమాలు కూడా విడుదలయ్యేవి లేకపోవడంతో కచ్చితంగా పెళ్లికి పిలవడానికి అయి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఈనెల 26న జరగనుందని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అలాగే మార్చి 4వ తేదీన గ్రాండ్గా రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే ఈ పెళ్లికి పిలవడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.. గత కొద్దిరోజులుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా ఈ ఇద్దరిలో ఎవరు ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇవ్వలేదు.. ఇక పెళ్లి గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. త్వరలోనే ఈ పెళ్లి గురించి ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.

రష్మిక – విజయ్ పెళ్లి ఫిక్స్ అయినట్లే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న, సెన్సేషనల్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గతంలో కలిసి పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా వీరిద్దరి కాంబోలో వచ్చిన గీత గోవిందం మూవీ భారీ సక్సెస్ ని అందుకుంది. ఆ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో రియల్ లైఫ్ లో కూడా వీళ్ళిద్దరూ పెయిర్ గా ఉంటే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే గత కొన్ని నెలలుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వార్తలుకి ఎక్కడ కూడా వీళ్లు రియాక్ట్ అవ్వలేదు. ఇక గత ఏడాది సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఈనెల 26న వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయినట్లు ఓ వార్త నెట్టెంటా చక్కర్లు కొడుతుంది. కానీ దీని గురించి క్లారిటీ అయితే రాలేదు. కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో ఈ పెళ్లి జరుగుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది..

Advertisement

Also Read :కొత్త హీరోయిన్ వచ్చేసిందోచ్.. బాధపడ్డ చక్రీ.. ప్రతాప్ మాటతో మహా కన్నీళ్లు..

బాలీవుడ్ లో రష్మిక బిజీ..

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయన నటిస్తున్న రౌడీ జనార్ధన్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అటు రష్మిక మందన్న సినిమాల విషయానికొస్తే.. పుష్ప మూవీ తర్వాత ఆమె కెరియర్ పూర్తిగా మారిపోయింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు. అటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన జోడిగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుంటుంది.. గత ఏడాది ఈమె నటించిన రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలను లైనప్ లో పెట్టుకుంటూ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి విజయ్ దేవరకొండ తో నిజంగానే పెళ్లి పీటలు ఎక్కుతుందా లేదా అన్నది మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×