E-Paper
Advertisement

Tollywood March box office: బాక్సాఫీస్ బ్యాడ్ టైమ్: టాలీవుడ్‌ని ముంచేసిన మార్చ్!

Tollywood March box office: బాక్సాఫీస్ బ్యాడ్ టైమ్: టాలీవుడ్‌ని ముంచేసిన మార్చ్!
Advertisement

Tollywood March box office: మార్చిఈ నెల అంటే ఒకప్పుడు టాలీవుడ్ కి గోల్డెన్ పీరియడ్.బలగం‘, ‘జాతిరత్నాలులాంటి చిన్న సినిమాల నుండి RRR లాంటి పాన్ ఇండియా వండర్స్ వరకు చాలా సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించిన నెల ఇది.అలాంటిది ఈ ఏడు మార్చి నెల మాత్రం టాలీవుడ్ పాలిట ఒక శాపం లా మారిపోయింది. ఎదురు చూడగా చూడగా ఎట్టకేలకి అన్నో అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చినఉస్తాద్బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడగా, చిన్న సినిమాలు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టలేకపోవడం గమనార్హం .ముఖ్యంగా మన తెలుగు హీరోలు బాక్సాఫీస్‌ను గాలికొదిలేస్తే, ఎక్కడో బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక డబ్బింగ్ సినిమా మన థియేటర్లను కాపాడాల్సి రావడం టాలీవుడ్ కి పెద్ద ఇన్సల్ట్ అనే చెప్పాలి.

 పది సినిమాలు.. బట్ నో హిట్ 

 మార్చి మొదటి వారం కే వస్తే ఈ వారం ఏకంగా 10 సినిమాలు బాక్సాఫీస్ పై ఎటాక్ చేశాయి.కానీ వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆడియన్స్ మనసుల్ని గెలవలేకపోయింది.థ్రిల్లర్ మూవీ అంటూ మృత్యుంజయ అంటూ  శ్రీవిష్ణు పెద్ద బిల్డప్ ఇచ్చాడు కానీ, థియేటర్లలో ఇది దారుణంగా ఫ్లాప్ అని తేలిపోయింది.ఇక వరలక్ష్మి శరత్ కుమార్ అన్నీ తానై నడిపించిన సరస్వతి సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదంటే కంటెంట్ ఎంత వీక్ గా ఉందో అర్థమవుతుంది.ఇక ఎవరో అన్నారని,లిటిల్ ఆర్ట్స్ లా ఎదో మేజిక్ చేస్తుందనే ఆశతో నేరుగా ఓటీటీలోకి వెళ్లాల్సిన సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాను థియేటర్లకు తీసుకొచ్చారు. కానీ మేకర్స్ జడ్జ్ మెంట్ పెద్ద రాంగ్ అని సున్నా మార్కులేసి సాగనంపారు ఆడియన్స్. క్రేజీ జోడీ శివాజీ-లయ కూడా ఈ బొమ్మని గట్టెక్కించకపోవడం ఆశ్చర్యమే !

Advertisement

also read:NTR Dragon Movie: హైప్ ఎక్కువ… వర్క్ తక్కువ? ‘డ్రాగన్’పై సరికొత్త డౌట్స్

పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే సాలిడ్ డిజాస్టర్ 

ఇక మొదటి వారం అలా సాగిపోతే రెండో వారం అసలు సినిమాలనే దించలేకపోయారు మేకర్స్. కారణం పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్ లలోకి ఎంట్రీ ఇస్తుందన్న టాక్ రావడమే .ఫలితంగా రెండు వారాల పాటు థియేటర్లకు అసలు ఫీడింగ్ లేకుండా పోయింది.అయితే మూడో వారంలో భారీ బడ్జెట్, అంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్ తో ఎంట్రీ ఇచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడని,వచ్చిన గ్యాప్ ని ఉస్తాద్ ఫిల్ చేస్తాడని ఆశపడితే  మొదటి రోజే మిక్స్ డ్ టాక్తో పెద్ద షాకే ఇచ్చాడు.హరీష్ శంకర్ తన మార్క్ డైలాగులతో పవన్ తనదైన  మేనరిజమ్స్ తో బాక్సాఫీస్ బండిని లాగడానికి ఎంత ట్రై చేసినా వీక్ కంటెంట్ ఆ బండికి అడ్డంగా పడిపోయింది.ఫస్ట్ డే టోటల్ గా  రూ.34.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించి పర్లేదనిపించిన సినిమా రెండో రోజుకు వచ్చేసరికి ఏకంగా 80 శాతం పడిపోయిందంటే ఆడియన్స్ ని ఎంత డిసప్పాయింట్ చేసిందో అర్థమవుతుంది.ముఖ్యంగా  లాంగ్ వీకెండ్, పండగ హాలీడేస్ ఉన్నప్పటికీ, 7 రోజుల్లో కనీసం రూ 100 కోట్ల గ్రాస్ కూడా దాటలేక పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత ఘోరమైన పరాజయాల్లో ఒకటిగా  నిలవడం గమనార్హం .

 నాలుగోవారమూ అంతే !

Advertisement

ఇక ఉస్తాద్ జాతకం తేలిపోవడంతో నాలుగో వారంలో మళ్ళీ చిన్న సినిమాలు క్యూ కట్టాయి.వాటిలో  బ్యాండ్ మేళం‘ (హర్ష్ రోషన్, శ్రీదేవి) సినిమా పరమ బోరింగ్‌ అన్న ట్యాగ్  వేసుకుంది, ముఖ్యంగా కోర్టు జోడీతో కోట్లు కొల్లగొట్టేద్దాం అని ప్లాన్ వేసిన కోన వెంకట్ కి ఈ సినిమా పెద్ద షాకే ఇచ్చింది. ఇక సుయోధన అంటూ ప్రియదర్శి చేసిన సినిమా రిలీజ్ అయిందని మేకర్స్ కైనా తెలుసో లేదో.ఇక డబ్బింగ్ అయి డబ్బులు రాల్చుతాయనుకున్నయూత్సినిమా కూడా డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. ఇక జీవీ ప్రకాష్ కుమార్ హ్యాపీరాజ్పరిస్థితి అంతకి మించి గొప్పగా ఏం లేదనే చెప్పాలి.

అసలైన హీరో రణ్వీర్ సింగ్

ఒకవైపు చిన్న సినిమాలు ఆడలేదు, మిడ్-రేంజ్ సినిమాలు లేవు, ఇక ఆదుకుంటాడనుకున్న ఉస్తాద్బాక్సాఫీస్ కు హ్యాండ్ ఇచ్చేశాడు.ఈ స్థితిలో టాలీవుడ్ బాక్సాఫీస్ అంతో ఇంతో కాసులతో కాస్తైనా కళకళలాడిందంటే అది రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్-2′ వల్లే. అవును ..మన హీరోలు చేతులెత్తేసిన చోట, ఈ డబ్బింగ్ సినిమానే  థియేటర్లను కాపాడింది మరి.మొత్తానికి ఈ మార్చి నెల టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఒక పెద్ద గుణపాఠం అనే చెప్పాలి. కంటెంట్ లేకపోతే ఎంతటి స్టార్ హీరో అయినా ప్రేక్షకులు థియేటర్ల మొహం కూడా చూడరని ఉస్తాద్నిరూపించాడు. సో..మన మేకర్స్ ఇప్పటికైనా మేల్కొని ఆ పాత ఫార్ములాలు పక్కన పెట్టి కొత్తగా ఆలోచించకపోతే ముందు ముందు పక్క రాష్ట్రాల డబ్బింగ్ సినిమాలు ఇక్కడ పాగా వేయడం ఖాయం !

also read:అఖండ 2 దెబ్బకి రూటు మార్చిన బాలయ్య ..!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×