E-Paper
Advertisement

ప్యాన్ ఇండియా ‘బద్ధకం’.. థియేటర్ల ఆకలి కేకలు!

ప్యాన్ ఇండియా ‘బద్ధకం’.. థియేటర్ల ఆకలి కేకలు!
Advertisement

Pan india movies : నిజమేనండి, థియేటర్ల పరిస్థితి చూస్తుంటే ముసలి కన్నెపిల్ల పెళ్లి కాక ఏడ్చినట్టు ఉంది. ఒకప్పుడు వారానికి రెండు మూడు సినిమాలు వచ్చేవి, బాక్సాఫీస్ దగ్గర సందడి ఉండేది. ఇప్పుడేమో హీరోలకి గర్వం పెరిగింది, అభిమానులకి ఓపిక నశించింది. మీరు అన్నట్టు ఒక్కో సినిమాకు వందల కోట్లు తీసుకుంటూ, ఏళ్ళకు ఒక సినిమా తీస్తూ ‘మహా వృక్షం’ లాగా బిల్డప్ ఇస్తున్నారు.ప్యాన్ ఇండియా ‘బద్ధకం’.. థియేటర్ల ఆకలి కేకలు!.. సినిమాలు బోలెడు ఉన్నా సరే థియేటర్లకు సరైన డేట్ లేక చాలా సినిమాలు రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అన్ని భాషలలో ఆ సినిమా రిలీజ్ కావాలన్న కోరికతో చేసే ప్రయత్నాలు ఒక్కొక్కసారి ఫలిస్తాయి. మరోసారి బోల్తా కొడతాయి.. అయినా కూడా ఫ్యాన్ ఇండియా మోజు మాత్రం జనాలకు తగ్గడం లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ కూడా ఫ్యాన్ ఇండియా సినిమాల కోసం కథలు వింటున్నారు.

ప్రస్తుతం మన సినిమా ఇండస్ట్రీ ఎలా తయారైందంటే.. “కథ కంటే బిల్డప్ ఎక్కువ, సినిమా కంటే టీజర్లే ఎక్కువ.” ఒక్క హిట్ కొట్టగానే చాలు, వెంటనే పక్క రాష్ట్రం వాడికి మన మొహం చూపించేయాలి అనే ‘ప్యాన్ ఇండియా’ పిచ్చి పట్టుకుంది. ఆ ప్యాన్ ఇండియా సినిమా కోసం వీళ్ళు చేసే హోమం, వ్రతం పుణ్యమా అని మూడేళ్లకో సినిమా వస్తుంది. ఈ లోపు థియేటర్ల యజమానులు టికెట్ కౌంటర్ల దగ్గర ఈగలు తోలుకుంటూ, పాప్‌కార్న్ మెషీన్లకి తుప్పు పట్టేలా చూస్తున్నారు.కోట్లకి పడగలెత్తడం: రెమ్యూనరేషన్ అడిగితే ఆకాశం వైపు చూస్తారు, సినిమా షూటింగ్ ఎప్పుడంటే మాత్రం ‘డేట్స్ లేవు’ అని డేకుతారు.

Advertisement

మొదటి రోజు ముచ్చట: ఇక్కడ లోకల్ మార్కెట్ లో పది రూపాయలు రాబట్టలేని వాడు కూడా, గడ్డం పెంచేసి హిందీలో డబ్ చేసి “నేను గ్లోబల్ స్టార్” అని పోజులిస్తున్నాడు.బద్ధకం vs బాధ్యత: సినిమా అంటే ఆర్ట్ కాదు, కేవలం అకౌంట్‌లో పడే అమౌంట్ అన్నట్టుగా మారిపోయింది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్లు ఏడాదికి పది సినిమాలు చేసేవారు. ఇప్పుడు మన హీరోలు ఒక్క సినిమా చేయడానికి మూడు తరాల సమయం తీసుకుంటున్నారు. థియేటర్లు అన్నీ కన్వెన్షన్ హాళ్లుగా, గోడౌన్లుగా మారిపోయాక, మీ హీరోయిజం మీ ఇంటి అద్దం ముందు చూసుకుంటారా? లేక ఓటీటీలో చిన్న విండోలో చూసుకుంటారా? సినిమా హాలు లేనిదే సూపర్ స్టార్ లేడు. సినిమాలు విడుదల చేయండి బాబు.. లేకపోతే రేపు పొద్దున థియేటర్లలో సినిమా బదులు ‘గృహప్రవేశం’ భోజనాలు పెట్టుకోవాల్సి వస్తుంది!

పాన్ఇండియా చిత్రాలతో హీరోలు అభిమానులకు చాలా దూరం అవుతున్నారన్న విషయం ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారు. ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసే హీరోలు ఇప్పుడు కేవలం రెండేళ్లకు ఒకటి లేదా మూడేళ్లకు ఒకటి రిలీజ్ చేసి భారీగానే డబ్బులు సంపాదిస్తున్నారు.. ఇంకొన్ని రోజులు పోతే సినిమాలు అనేది జనాలు గుర్తుపెట్టుకుంటారో లేదో అన్నది ఆసక్తిగా మారుతుంది.. ఇప్పటికైనా హీరోలు ధోరణి వదులుతారా? చూడాలి..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×