E-Paper
Advertisement

టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సమ్మర్.. 2027లో బాక్సాఫీస్ దగ్గర 3000 కోట్ల వేట

టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సమ్మర్.. 2027లో బాక్సాఫీస్ దగ్గర  3000 కోట్ల వేట

Summer Clash: ఏ సీజన్ ఎలా ఉన్న సమ్మర్ సీజన్ పై మాత్రం భారీ ఆశలే పెట్టుకుంటుంది టాలీవుడ్ బాక్సాఫీస్. కానీ ఈ ఏడాది ఎందుకో ఆ సందడి మిస్ అయింది. పెద్ద స్టార్లు ఎవరూ తమ సినిమాలతో పలకరించకపోవడంతో థియేటర్ల దగ్గర అనుకున్నంత స్థాయిలో కలకలలాడలేదు. జూన్ 4న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో వచ్చి ఈ ఏడాది సమ్మర్‌ను ముగించబోతున్నాడు. అయితే, ఈ ఏడాది మిస్ అయిన సందడిని వచ్చే ఏడు డబల్ చేసి ఇస్తామంటూ వచ్చే ఏడాది (2027) టాప్ స్టార్లందరూ క్యూ కడుతున్నారు.

 ప్రభాస్ పంజా

వచ్చే సమ్మర్ వార్ ని నేను మొదలెడతా నంటూ రెడీ అయిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ మార్చి 5, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. వంగా మార్క్ యాక్షన్, ప్రభాస్ స్వాగ్ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలైనట్టే!

 మహేశ్ బాబు విశ్వరూపం

ఇక ‘స్పిరిట్’ హంగామా తగ్గేలోపే, జక్కన్న తన తర్వాతి అస్త్రాన్నివదిలేందుకు సిద్దమయ్యాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.హాలీవుడ్ రేంజ్ విజువల్స్, మహేశ్ బాబు మేకోవర్ ఈ సినిమాను ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతుందనడంలో సందేహం లేదు కూడా.

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మాస్ జాతర

సమ్మర్ చివరలో అసలైన మాస్ ఫీస్ట్ ఇచ్చేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 11న విడుదల కానుంది. నీల్ ఎలివేషన్స్, తారక్ ఎనర్జీ కలిస్తే థియేటర్లలో హంగామా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.మొత్తానికి సమంర్ సీజన్ ని ప్రభాస్ మొదలెడితే తారక్ ముగించాబోతున్నాడన్న మాట.

చిరు వర్సెస్ బాలయ్య?

ఇక మార్చి, ఏప్రిల్, జూన్ నెలలు లాక్ అయిపోయాయి. మరి మే నెలలో వచ్చే ఆ టాప్ స్టార్ ఎవరు? అన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. వినిపిస్తున్న టాక్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి – బాబీ సినిమా, అలాగే నందమూరి బాలకృష్ణ – కొరటాల శివ సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల సంక్రాంతి మిస్ అయితే, ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి మే నెలను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం , సీనియర్ హీరోల ఎంట్రీతో సమ్మర్ ఇంకాస్త హాట్ గా మారడం పక్కా .

రికార్డుల వేట

ఇలా ఒకే సీజన్‌లో ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి ముగ్గురు ప్యాన్ ఇండియా స్టార్లు థియేటర్లలోకి రావడం చాలా రేర్ అనే చెప్పాలి.చూడాలి మరి 3వేల కోట్ల పొటెన్శియల్ తో వస్తున్న ఈ సినిమాలు ఎలాంటి రికార్డులని తిరగరాస్తాయో !

Related News

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

Big Stories

×