E-Paper
Advertisement

సౌత్ టు నార్త్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్-స్టాపబుల్.. త్రివేండ్రం వేదికగా నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

సౌత్ టు నార్త్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్-స్టాపబుల్.. త్రివేండ్రం వేదికగా నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!
Advertisement

Allu Arjun Kerala Fans: అల్లు అర్జున్ కి కేరళ నాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గూర్చి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఇక తాజాగా కేరళ రాజధాని త్రివేండ్రం వేదికగా జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) రాష్ట్ర స్థాయి సమావేశం అంచనాలకు మించి అత్యంత విజయవంతంగా ముగిసింది. కేరళలో ‘మల్లు అర్జున్’గా పిలవబడే బన్నీకి ఉన్న క్రేజ్ చూస్తుంటే, అక్కడి హీరోలకైనా అంతమంది ఫ్యాన్స్ ఉంటారా అన్న డౌట్ వస్తుంది.

భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు

Advertisement

తాజాగా కేరళ స్టేట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి సమక్షంలో జరిగిన ఈ భారీ సమావేశంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రభు సారథ్యంలో జరిగిన ఈ భేటీలో అభిమాన సంఘం భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా కేరళలోని ప్రతి గ్రామం, ప్రతి మూలలో ఉన్న బన్నీ అభిమానులను ఏకం చేయడం, ఐకాన్ స్టార్ ఇన్స్పిరేషన్ తో రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయడం మరియు జిల్లాల వారీగా పటిష్టమైన కమిటీలను ఏర్పాటు చేసి అసోసియేషన్‌ను దేశంలోనే నంబర్ వన్ ఫ్యాన్స్ ఆర్గనైజేషన్‌గా తీర్చిదిద్దడం వంటి అంశాలపై చర్చించారు.

also read: విజయ్ బాటలో అల్లు అర్జున్ ..సీయం అవుతాడా ?

Advertisement

సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్ జూన్ 4న

అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్ జూన్ 4న నిర్వహించబోతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్‌కు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ నుంచి వేలాది మంది అభిమానులు తరలిరానున్నారు. ఇది కేవలం ఒక మీటింగ్ మాత్రమే కాదు, ఐకాన్ స్టార్ స్టామినాను చాటిచెప్పే ఒక భారీ వేడుకగా ఉండబోతోంది. ఇప్పటికే సౌత్ ఇండియాలో తిరుగులేని శక్తిగా ఎదిగిన AAFA, ఇప్పుడు తన కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ‘పుష్ప’ సినిమాతో నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ కు ఏర్పడిన విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఇకపై ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అధికారికంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా భారతదేశంలోనే అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించడం పెద్ద విషయం కాదు కూడా .ఇక భారత్ మొత్తం జూన్ 4న జరగబోయే ఈ ఈవెంట్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది” అని కేరళ AAFA ప్రతినిధులు ఈ సందర్భంగా తమ కాన్ఫిడెన్స్ చూపించారు

ఎలాంటి సంచలనాలకి దారితీస్తుందో

కేరళలో అల్లు అర్జున్ సినిమాలకు వచ్చే వసూళ్లు, ఆయన పట్ల మలయాళీ ఆడియన్స్ చూపే ప్రేమ చూస్తుంటే, ఆయనను అక్కడ ఒక లోకల్ సూపర్ స్టార్‌గానే భావిస్తారానడంలో ఆశ్చర్యం లేదు.చూడాలి మరి రాష్ట్రాలు దాటి విస్తరిస్తున్న బన్నీ క్రేజ్ ముందు ముందు ఎలాంటి సంచలనాలకి దారితీస్తుందో !

also read :సమంత షాకింగ్ డెసిషన్.. బాక్సాఫీస్ రేసు నుంచి ‘బంగారం’ మిస్సింగ్?

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×