E-Paper
Advertisement

Toxic Glimpse: కార్ సీన్ పై నెటిజన్స్ పెదవి విరుపు.. డైరెక్టర్ దిమ్మతిరిగే క్లారిటీ!

Toxic Glimpse: కార్ సీన్ పై నెటిజన్స్ పెదవి విరుపు.. డైరెక్టర్ దిమ్మతిరిగే క్లారిటీ!

Toxic Glimpse: ఒకప్పుడు క్రిటికల్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ అందుకున్న లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohandas) తొలిసారి టాక్సిక్ (Toxic) పేరుతో కమర్షియల్ ప్రాజెక్టును చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇందులో నటిస్తున్న పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా ఇటీవల హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసింది డైరెక్టర్ . అయితే ఇందులో హాలీవుడ్ వెబ్ సిరీస్ తరహాలో ఇంటిమేట్ సీన్లను పెట్టి కొంతమంది చేత విమర్శలు కూడా ఎదుర్కొంటోంది ఈ ముద్దుగుమ్మ . ఈ నేపథ్యంలోనే నెటిజన్స్ ట్రోల్స్ కి తనదైన రీతిలో క్లారిటీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

విమర్శలపై డైరెక్టర్ కౌంటర్..

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. ఈ సినిమా అభిమానులలో భారీ ఆసక్తిని సృష్టిస్తోంది. “ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్” అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం నుండి ఇటీవల యష్ పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో కారు సన్నివేశంలో యష్.. విదేశీ యువతితో చేసిన సన్నివేశం విమర్శలకు దారితీసింది. దీనిపై దర్శకురాలు గీతూ మోహన్ దాస్ స్పందిస్తూ..”మహిళా దర్శకురాలు ఇలాంటి సన్నివేశాలు రూపొందించింది అంటూ వచ్చే విమర్శలతో నేను మరింత చిల్ అవుతున్నాను” అంటూ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే గీతూ మోహన్ దాస్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టాక్సిక్ సినిమా విశేషాలు..

టాక్సిక్ సినిమా విషయానికొస్తే.. టాక్సిక్ లో యష్ తోపాటు మరో ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కియారా అద్వానీ , తారా సుతారియా , నయనతార, హుమా ఖురేషి , రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ డ్రామా థ్రిల్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై యష్ , వెంకట కే నారాయణ నిర్మిస్తున్నారు.

also read:The RajaSaab: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ సీన్స్ యాడ్ చేస్తున్న మేకర్స్.. ఇప్పటికైనా ?

ఇంటిమేట్ సీన్ లో విదేశీ యువతి..

ఇకపోతే ఈ గ్లింప్స్ లో వచ్చిన ఇంటిమేట్ సీన్లు విదేశీ యువతి నటించిన హాలీవుడ్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. నటి మాత్రమే కాదు నిర్మాత కూడా.. అంతేకాదు స్టంట్ కొరియోగ్రాఫర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. మరోవైపు నటాలీ బర్న్ ఇందులో నటించడమే కాకుండా ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. పైగా ఇదే ఈమెకు తొలి ఇండియన్ మూవీ కూడా కావడం గమనార్హం. ఇకపోతే ఈ చిత్రాన్ని కన్నడతో పాటు ఇంగ్లీష్ లో రిలీజ్ చేయనున్నారు. పైగా తెలుగు, తమిళ్ , మలయాళం, హిందీ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×